Tue Mar 24 2026 11:55:58 GMT+0530 (India Standard Time)
శ్రీదేవి కూతురు బ్యాక్ టూ షూటింగ్

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన తొలి చిత్రం 'ధడక్' ద్వారా వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి చనిపోవటం కారణంగా జాన్వీ కపూర్ ఈ షూటింగ్ కు 10 రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ తిరిగి వచ్చింది. ఆ బాధను మనసులోనే దిగమింగిన జాన్వీ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది.
రెండు రోజులు క్రితం తన 21వ పుటిన రోజు జరుపుకున్న జాన్వీ..ఈ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేయాలనీ చిత్ర యూనిట్ తో చెప్పిందట. ఈ షెడ్యూల్ లో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను బాంద్రా ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.
'ధడక్' సినిమా మరాఠీ లో సూపర్ హిట్ అయిన 'సైరాత్' హిందీ రీమేక్ గా ఈ చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయనున్నారు చిత్ర యూనిట్.

Next Story

