శృతికి తల పొగరు ఎక్కువైంది

శృతి హాసన్ కి ఈ మధ్యన చాలా ఎక్కువైంది. చేతిలో సినిమాలు లేకపోయేసరికి అమ్మడు ఏది పడితే అది చేస్తూ.. ఏదిపడితే అది మాట్లాడుతుంది. గబ్బర్ సింగ్ తో తెచ్చుకున్న ఫెమ్ మొత్తం కాటమరాయుడితో పోగొట్టుకుంది. పవన్ కల్యాణే లైఫ్ ఇచ్చాడు. పవన్ కల్యాణే శృతి హాసన్ ని అట్టర్ ప్లాప్ హీరోయిన్ ని చేసాడు. ప్రస్తుతానికి శృతి హాసన్ చేతిలో తన తండ్రి సినిమా శభాష్ నాయుడు తప్ప మరే సినిమా లేదు. ఆ సినిమా కూడా ఎప్పుడు విడుదలవుతుందో ఎటువంటి క్లారిటీ లేదు. అలాగే శృతి హాసన్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఆమె కెరీర్ మీదే పెద్ద దెబ్బ పడింది. అదేమిటంటే భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న సంఘమిత్ర నుండి కారణం లేకుండా తప్పుకోవడం.
అయినా అమ్మడుకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇప్పుడు కూడా తాజాగా ఒక కన్నడ నిర్మాత తాము నిర్మించబోయే సినిమాలో శృతి హసన్ నటిస్తుంది అని అధికారికంగా ప్రకటించాడు. అయితే వెంటనే శృతి హాసన్ బాలీవుడ్ లో తాను చాలా బిజీగా ఉన్నానని... కన్నడ సినిమాల్లో చేసే తీరిక లేదంటూ వెటకారంగా ట్వీట్ చేసింది. దీంతో ఒళ్లుమండిన మలయాళ సీనియర్ హీరో ఒకాయన శృతి హసన్ ని మేకప్ లేకుండా అస్సలు చూడలేమని..... తన కన్నా అందగత్తెలు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారని... దాంట్లో ఏమన్నా అనుమానం ఉంటే కాస్త చరిత్ర తిరగేసి చూసుకోమని కౌంటర్ ఇచ్చాడు.
మరి శృతి హాసన్ కి బాలీవుడ్ లో ఓ... అన్నంత సినిమాలేమి లేవు. ఇప్పటివరకు అమ్మడు నటించిన బాలీవుడ్ సినిమాలన్నీ గోవిందా అన్నావే. మరి అలాంటప్పుడు శృతి హాసన్ కావాలనే సినిమాలకు గ్యాప్ ఇస్తున్నాని.. తనకు నచ్చిన పాత్రలు రానప్పుడు ఇలా గ్యాప్ తీసుకోవడం ఉత్తమమని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తుంది.

