Tue Dec 23 2025 14:07:33 GMT+0000 (Coordinated Universal Time)
శర్వా గురించి ప్రచారం మొత్తం పుకారేనంట!

శర్వానంద్ పెళ్లి చేసుకుంటున్నాడనే వార్త ఇప్పడు టాలీవుడ్ లో టాప్ న్యూస్ గా చక్కెర్లు కొడుతోంది. ఒక పక్క మోడీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనతో మీడియా లో గ్యాప్ లేకుండా కథనాలు ప్రచారం చేస్తుంటే.... మరోపక్క శర్వానంద్, రామ్ చరణ్ మరదల్ని పెళ్లి చేసుకుంటున్నాడనే వార్త సోషల్ మీడియాలో టాప్ లెవల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయి. రామ్ చరణ్, శర్వాలు మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ వీరిద్దరి చాలా మంచి ఫ్రెండ్స్ అంట. ఈ ఫ్రెండ్ షిప్ లో భాగంగానే రామ్ చరణ్ భార్య ఉపాసన వరసకు చెల్లెల్ని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడని నిన్న సోషల్ మీడియాలో ఒకటే రచ్చ.
ఇక వీళ్లిద్దరు తోడల్లుళ్లు కాబోతున్నారని... ఈ పెళ్లిని రామ్ చరణ్ సెటిల్ చేసాడని ఒకటేమిటి అనేక రకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ ఒట్టి రూమర్స్ అని అంటున్నారు శర్వానంద్ ఫ్యామిలీ వాళ్ళు. అసలు శర్వా పెళ్లి గురించి ఇంకేం ఆలోచించలేదని... ఇప్పట్లో శర్వానంద్ కి పెళ్లి ఆలోచన లేదన్నట్లుగా అంటున్నారు. మరి శర్వానంద్ పెళ్లి రామ్ చరణ్ మరదలితో అని ఎవరు చెప్పారో తెలియదు గాని అది మాత్రం ఒక గాసిప్ అని ఇప్పుడు అందరూ కొట్టిపారేస్తున్నారు. అసలు ఈ రూమర్ అంతలా ప్రచారంలోకి రావడానికి కారణం మాత్రం శర్వానంద్, చరణ్ క్లోజ్ ఫ్రెండ్ అవడమే. ఇంకా చరణ్ భార్య ఉపాసన చేల్లెలితో శర్వా పెళ్లి అనేసరికి ఈ హాట్ న్యూస్ వైరల్ లా అంతటా పాకీ పోయింది.
Next Story

