శతదినోత్సవం జరుపుకోవడం ఖాయమట!!

నాలుగైదేళ్లుగా ప్రభాస్‌ని ఆయన అభిమానులు ప్రేక్షకులు 'బాహుబలి' లుక్‌లోనే చూస్తున్నారు. దాంతో 'సాహో' కోసం తమ హీరో ఎలాంటి స్టైల్లో, ఎలాంటి ఫిజిక్‌తో కనిపిస్తాడని అందరిలో ఆసక్తి ఉంది. తాజాగా పీఆర్వో వంశీ ప్రభాస్ న్యూలుక్‌ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ న్యూలుక్‌కి అభిమానులు ఫిదా అవుతుండగా, మరికొందరు ప్రభాస్‌లో ఏదో తేడా ఉందంటున్నారు. మొత్తానికి ఈ లుక్ మాత్రం ఫ్రెష్‌గా ఆకట్టుకునేలాఉంది.
కాగా ఈ చిత్రం కోసం ప్రభాస్ 'బాహుబలి' కంటే చాలా సన్నబడి, బరువు తగ్గి కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రభాస్ బరువు తగ్గాల్సిన అవసరం ఉండటంతో మొదట్లో అనుష్కను అనుకున్నప్పటికీ ఈమె లావుగా ఉండటంతో ఆమెను పక్కనపెట్టేశారు. ఇంకా హీరోయిన్ని ఫైనలైజ్ చేయలేదు. ఇక ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. విలన్ నీల్‌నితిన్ ముఖేష్‌పై సీన్స్ తీస్తున్నారు. ఈ నెలాఖరులో ప్రభాస్ షూటింగ్లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఇది ప్రభాస్‌కి 19 వ చిత్రం. ఈ చిత్రం కోసం ఏకంగా 150 కోట్ల భారీ బడ్టెజ్ని యువి క్రియేషన్స్ అధినేతలు కేటాయించారు.
శంకర్ -ఎహసాన్-లాయ్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళంతో పాటు బాలీవుడ్లో కూడా రూపొందనుంది. ఇక ప్రభాస్ 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం విడుదలై 75రోజులైంది. ఇప్పటికీ అనేక భాషల్లో, పలు కేంద్రాలలో ఆడుతూనే ఉంది. ఈ సందర్భంగా తమకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వంద రోజుల చిత్రాలే లేని నేటిరోజుల్లో ఈ చిత్రం చాలా సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుని మరో రికార్డును నెలకొల్పడం ఖాయమంటున్నారు.

