వైసిపి ఎమ్మెల్యే తో మహేష్

మరికొన్ని గంటల్లోనే స్పైడర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ - మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి మాత్రమే కాదు భారీ అంచనాలున్నాయి. మొన్నటివరకు మహేష్ బాబు తమిళనాట స్పైడర్ చిత్రాన్ని విస్తృత ప్రచారం చేసి తెలుగు వెర్షన్ ని అస్సలు పట్టించుకోవడంలేదని అందరూ అనుకున్నారు. అయితే మహేష్ తొలిసారి తమిళంలో అడుగుపెడుతున్నాడు కాబట్టే అక్కడ తమిళనాట ఎక్కువ ప్రచారం చేసాడు. అయితే తెలుగులో మహేష్ కి ఉన్న ఫాలోయింగ్ తోనే స్పైడర్ చిత్రానికి మంచి అంచనాలొచ్చేశాయి. అయినా మహేష్ నిన్న సోమవారం నుండి తెలుగులో స్పైడర్ ఇంటర్వ్యూ లతో హోరెత్తిస్తున్నాడు. ఛానళ్లు, ప్రింట్ మీడియా, వెబ్ మీడియా ఇలా అన్ని ప్రచార మధ్యమాలతో కాంటాక్ట్ లో ఉంటూ స్పైడర్ ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకెలుకుతున్నాడు.
పలు ఛానల్స్ కి స్పైడర్ ఇంటర్వ్యూలు ఇస్తున్న మహేష్ ఒక మాజీ హీరోయిన్, జబర్దస్త్ ఫెమ్, ఎమ్యెల్యే అయిన రోజాతో చేసిన స్పైడర్ ఇంటర్వ్యూ గురించిన టాపిక్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో జోరుగా హల్చల్ చేస్తుంది. వైసీపీ ఎమ్మెల్యే రోజా..
ఈ-టివిలో జబర్దస్త్ లో జెడ్జి గా వ్యవరిస్తూ అలరిస్తుంది. అయితే అందరూ యాంకర్స్ తో మహేష్ స్పైడర్ ఇంటర్వ్యూ లు తీసుకుంటుంటే సాక్షి ఛానల్ వారు మాత్రం తమ ఎమ్మెల్యేని ఉపయోగించుకుని కొత్తగా రోజాతో మహేష్ ఇంటర్వ్యూ తీసుకుంది. అయితే ఆ ఇంటర్వ్యూ ని రికార్డ్ చేసిన సదరు ఛానల్ త్వరలోనే దాన్ని టెలికాస్ట్ చేయనుంది. మరి రాజకీయాల్లోనూ, టివి షోస్ లో యమా యాక్టివ్ గా ఉంటున్న రోజా ఇప్పుడు మహేష్ ఇంటర్వ్యూ ని ఏ రేంజ్ లో చేసిందో అంటున్నారు.

