‘వేరు-చెట్టు’ కథతో మెగాను ఆకాశానికెత్తేశాడు

విడుదలైన ఆరు చిత్రాలలో ఐదు విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా దూసుకుపోతున్న దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆయన విజయాలు అన్ని భారీ సంచలనాలు కావటంతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న బోయపాటి శ్రీను కి ఇటీవల పోసాని కృష్ణ మురళి మీడియా ముఖంగా తన వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలు చికాకుపెట్టాయి. కొరటాల శివ ఒక ఇంటర్వ్యూలో ఇతరుల ప్రతిభని సొంత ప్రయోజనాలకు వాడుకునే చేదు అలవాటు బోయపాటి శ్రీను కి ఉండటం వలన ఆయన దగ్గర పని చేసిన తాను చాలా నష్టపోయానని చెప్పడం కూడా చిన్న దెబ్బగా మారింది. కొరటాల చేసిన ఆరోపణలు బోయపాటి శ్రీను రెప్యుటేషన్ ని బాగా దెబ్బతీశాయి. ఈ ఆరోపణలకు బోయపాటి స్పందన తెలపకుండా మౌనం వహించటంతో ఈ ఆరోపణలు అన్నీ వాస్తవాలే అని ప్రజలు విశ్వసించారు. దానితో తదుపరి చిత్రం వచ్చే లోపు ప్రేక్షకులకు చేరువకావటానికి ధ్రువ వేడుకను మెగా ఫామిలీ హీరోలను వాడుకోవాలి అని కంకణం కట్టుకుని వేడుకకు హాజరు అయినట్టు వున్నాడు.
"ఒక వేరు మంచిది అయితే అది ఎదిగే క్రమంలో దాని నీడన ఇతర చిన్న మొక్కలకు చేయూత నిస్తూ ఎదిగిన తరువాత అనేక కొమ్మలకు, పండ్లకు పునాది అవుతుంది. అటువంటి వేరు పేరు మెగా స్టార్ చిరంజీవి. ఆయన నీడలో ఎదిగిన వారిలో ఒకరు రామ్ చరణ్ తేజ్. కాబట్టి నాణ్యమైన పండు అని గుడ్డిగా నమ్మేయొచ్చు. ఇక ధ్రువ చిత్రం గురించి మాట్లాడాల్సి వస్తే నిర్మాత అల్లు అరవింద్ కూడా ఆ వేరు నీడలో ఎదిగిన నిర్మాతే. ఒకరు అమితంగా ప్రేమించి చేస్తేనే చిత్రం భారీ విజయం దక్కించుకుంటుంది. ఇక ఇంతమంది అహర్నిశలు కష్టపడి తీర్చి దిద్దిన చిత్రం విజయం వైపుగా వేసే అడుగులను ఆపగలగటం ఎవరి తరం కాదు." అంటూ ఒకింత ఉద్రేకపూరితమైన పొగడ్తలతో మెగా ఫామిలీ ని ముంచేశాడు బోయపాటి శ్రీను.
మెగా స్టార్ చిరంజీవి 151 లేదా 152 వ ప్రాజెక్ట్ కు దర్శకత్వ బాధ్యతలు స్వీకరించటానికి ఉవిళ్ళూ ఊరుతున్న బోయపాటి అందుకే ఈ పొగడ్తల వర్షం కురిపించాడు అని గుసగుసలు కూడా వినపడుతున్నాయి.

