వెంకీ గెస్ట్ కాదు

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అజ్ఞాతవాసి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఈ మధ్య కాలంలో మరే సినిమాకి లేవంటే నమ్మశక్యం కాదు. వారి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఆ విధమైన భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. అందులోను ఈ సినిమాలో చిన్న అతిథి పాత్రలో వెంకటేష్ నటించాడంటూ ఆ మధ్య వార్తలు రావడం కూడా ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచింది. అయితే వెంకీ అజ్ఞాతవాసి సినిమాలో అతిధి పాత్రలో నటించాడని న్యూస్ ప్రచారం జరిగినా... దానిపై క్లారిటీ లేదు.
మొన్నటికి మొన్న వెంకటేష్ అజ్ఞాతవాసి షూటింగ్ కేవలం రెండు రోజుల్లో పూర్తి చేసాడు అనగానే... వెంకీ ఈ సినిమాలో ఎదో చిన్న గెస్ట్ రోల్ అని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఈ మేటర్ పై క్లారిటీ వచ్చింది. వెంకీ అజ్ఞాతవాసి సినిమాలో ఉన్నాడు. కాకపోతే అది అతిథి పాత్ర కాదు. చాలా కీలకమైన పాత్ర అంటున్నారు. అజ్ఞాతవాసి సినిమా కోసం వెంకీ 10 రోజుల కాల్షీట్లు ఇచ్చాడట. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర కోసమే వెంకటేష్ ను తీసుకున్నారట. నిజానికి పవన్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించడానికి వెంకీకి ఎప్పుడూ అభ్యంతరం లేదు. కానీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో ను అలా కొన్ని నిమిషాలపాటు చూపించడం త్రివిక్రమ్ కు ఇష్టం లేదు.
అందుకే వెంకీని ఓ కీలక పాత్రలో చూపించాడట త్రివిక్రమ్. మరి బయట మంచి ఫ్రెండ్స్ అయిన వెంకటేష్, పవన్ కళ్యాణ్ లు అజ్ఞాతవాసిలో ఎలాంటి పాత్రల్లో కనిపిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇకపోతే అను ఎమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కు మరదలిగా కీర్తిసురేష్ కనిపించనుంది.

