వెంకీ ఎన్ని నిముషాలు కనబడతాడో గాని...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన మూవీ అజ్ఞాతవాసి. ఈ ఇద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేసినప్పట్నుంచి ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దాదాపు అంటే ఆడియో వేడుక, టీజర్ రిలీజ్, పోస్ట్ పొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10 న సంక్రాంతి సందర్బంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అజ్ఞాతవాసి మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ లో రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుండగా ఇటివలే రిలీజ్ అయిన టిజర్ మూవీ పై ఇంకా అంచనాల్ని రెట్టింపు అయ్యేలా చేసింది.
ఇకపోతే ఈ మూవీలో పవన్ సరసన అనుఇమ్మాన్యుయల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించారు. అయితే అజ్ఞాతవాసి లో పవన్ కళ్యాణ్ స్నేహితుడు విక్టరీ వెంకటేష్ ఒక చిన్న రోల్ లో నటించాడనే విషయం తెలిసిందే. అయితే మూవీ లో వెంకటేశ్ క్యారెక్టర్ కి వచ్చే రెస్పాన్స్ మాములుగా ఉండదు అని చిత్ర బృందం చెబుతుంది. వెంకటేష్, పవన్ కళ్యాణ్ మధ్యన వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ అంటున్నారు వారు. గతం లో పవన్ కళ్యాణ్ ఇంకా వెంకటేష్ గోపాల గోపాల అనే మల్టీ స్టారర్ మూవీ లో నటించిన సంగతి అందరికి తెలిసిందే.
ఇకపోతే అజ్ఞాతవాసిలో వెంకటేష్ తన పాత్ర యొక్క షూట్ ని కేవలం రెండు రోజుల్లోనే పూర్తి చేసాడు అని తెలుస్తుంది. అంటే కేవలం ఒక ఐదారు నిమిషాలే వెంకీ మనకు అజ్ఞాతవాసిలో కనబడతాడని అనుకోవాలి మనం. ఇక ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇప్పటికే మార్కెట్ లో హల్చల్ చేస్తుంది.

