వినాయకుడి పెళ్లిలా మారుతోన్న యంగ్‌రెబెల్‌స్టార్ మ్యారేజ్..!

ప్రస్తుతం తెలుగులో ఉన్న మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్‌లర్ ఎవరు అంటే ఠక్కున అందరూ బాహుబలి ప్రభాస్ పేరే చెబుతారు. దేశవ్యాప్తంగా కూడా ఈయన పెళ్లిపై పలు వార్తలు వస్తున్నాయి. ఇక తన పెళ్లి విషయంలో వస్తున్న వార్తలపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి గురించి తాను గానీ, తన కుటుంబసభ్యులు గానీ ఆలోచించడం లేదని, మరో ఏడాది వరకు ఆ ప్రస్తావనే లేదని చెప్పేశాడు. తమ కంటే తన అభిమానులు, ముఖ్యంగా మహిళాభిమానులే ఎక్కువగా తన పెళ్లి గురించి ఆందోళన చెందుతున్నారని, వారు అంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ఆనందంగా ఉందని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం 'సాహో' చిత్రంపైనే అని తెలిపాడు.
మరోవైపు హీరో రానా ప్రభాస్‌కి పెళ్లికూతురు కావలను అనే ప్రకటన చేశాడు. దీని గురించి ప్రభాస్ మాట్లాడుతూ, "రానా క్రియేటివిటీకి ఇది అద్దం పడుతుంది. నేను నా పెళ్లి చేసుకుంటానని రానాకి చెప్పలేదు. ఆయన కూడా నేను పెళ్లి చేసుకుంటున్నాననే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదు".
ఆయన తమషాగా ఇది చేశాడు. ఇక నా కెరీర్ మొదట్లో ఇలాంటి రూమర్లు వస్తే బాధపడేవాడిని, కానీ తర్వాత పట్టించుకోవడం మానేశాను. సినీ సెలబ్రిటీల విషయంలో ఇదికామనే. ఎవరైనా రెండుమూడు చిత్రాలలో కలసి నటిస్తే ఇలాంటివి సర్వసాధారణంగా వస్తుంటాయి. ఆధారాలు లేకుండా ఇలాంటివి రాయడం మంచిది కాదని ముందు భావించినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. సో ప్రభాస్ 'సాహో' విడుదలయ్యే వరకు పెళ్లి గురించి ఆలోచించనని చెప్పి రూమర్లకు ఫుల్స్టాప్ పెట్టాడు.

