విజయ్ మామూలోడు కాదు

విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా దగ్గరనుండి తెగ ఫెమస్ అయ్యాడు. యువత నోటా వెంట విజయ్ దేవరకొండ పేరునే స్మరిస్తున్నారు అంటే... అర్జున్ రెడ్డి కేరెక్టర్ లో విజయ్ నటన ఎలా ఉండాలి. అందుకే విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతంగా పెరిగిపోయింది. మరోపక్క షాప్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సత్తా చాటుతున్న ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలో పరిచయాలు పెంచుకునే పనిలో బిజీగా వున్నాడు. అందులో భాగంగా నే విజయ్ దేవరకొండ హీరోహీరోయిన్స్ కి పార్టీలు గట్రా ఇస్తూ బిజీ అయ్యాడు.
ఇకపోతే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ నుండి ఎలాంటి సినిమా వస్తుందా అనే ఆత్రుతతో కుర్రకారు ఉన్నారు. అయితే విజయ్ చేతిలో రెండు మూడు సినిమాలతో పాటు నాలుగైదు సినిమాలు వరుసలో ఉన్నాయి. లెజండరీ డైరెక్టర్స్ తో విజయ్ సినిమా అంటూ తెగ వార్తలొస్తున్నాయి. అయితే మనోడు మాత్రం టాలీవుడ్ మాటల మాంత్రికుడు, క్లాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లోను... అలాగే అనుష్క శెట్టి తోనూ పనిచేస్తానంటూ చెప్పి షాక్ ఇచ్చాడు. అదేమంత షాకింగ్ విషయము కానప్పటికీ విజయ్ చెప్పిన విధానం మాత్రం అందరిని ఆలోచనలో పడేసింది.
నిన్న నవంబర్ 7 న త్రివిక్రమ్, అనుష్క ల పుట్టినరోజు సందర్భంగా.... అందరి స్టార్స్ వలె వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా వారిద్దరితో త్వరలోనే పనిచేస్తానంటూ కామెంట్ చేసాడు విజయ్ దేవరకొండ. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలనే ప్రతి హీరో కలలు కంటాడు.... మరీ ఇంతగా ఓపెన్ గా అయితే ఎవరు అవకాశం అడగరు అంటూ విజయ్ మీద సెటైర్స్ వేస్తున్నారు. అలాగే స్వీటీ పక్కన ఈ హీరో అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.

