విజయ్ అదరగొడుతున్నాడు

కోలీవుడ్ లో హీరో విజయ్ కి మంచి స్టార్ ఇమేజ్ వుంది. అసలు రజినీకాంత్ తర్వాత అజిత్, విజయ్ నువ్వా నేనా అని పోటీ పడే స్థాయిలో ఉన్నారు. రజినీకాంత్ అభిమాన గణం తర్వాత విజయ్ కి, అజిత్ తమిలనాట మంచి అభిమాన గణం ఉన్నారు. అజిత్ కన్నా ఒకింత ఎక్కువగానే విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అక్కడ. ఇపుడు విజయ్ తాజాగా 100 కోట్ల మార్కెట్ ని అందుకుని స్టార్ హీరోగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇప్పుడు తన 100 కోట్ల మార్క్ ని తానే క్రాస్ చెయ్యడానికి సిద్ధం గా వున్నాడు.
విజయ్ తాజాగా నటించిన ‘మెర్సెల్’ విడుదలకు సిద్ధంగా వుంది. అట్లీ దర్శకత్వంలో సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ లు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో విజయ్ మూడు పాత్రల్లో మెరవబోతున్నాడు. ఇక ఈ చిత్ర టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. విజయ్ ఈ టీజర్ లో బాగా మెప్పించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకునేలాగే ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించినట్లుగా అర్ధమవుతుంది. ఈ టీజర్ లో విజయ్ సూపర్ గా కనిపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతోపాటే.... మంచి మంచి సన్నివేశాలు ఈ టీజర్ లో కనబడుతున్నాయి.
ఇక తెలుగు మూడు పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్ 'జై లవ కుశ' హిట్ అనిపించుకుంది. మరి అక్కడ తమిళనాట కూడా విజయ్ మూడు పాత్రల్లో నటించిన ఈచిత్రం కూడా విజయవంతమైతే హీరోలంతా ఇక మూడు పాత్రలో కనబడడానికి ఆలోచించరు. ఇదే సినిమాని తెలుగులో కూడా' అదిరింది 'అనే టైటిల్ తో అనువదించి విడుదల చెయ్యనున్నారు. ఇక ఈ చిత్రంలో మరో ప్లస్ పాయింట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే లో 'బాహుబలి' కథా రచయిత కె. విజయేంద్రప్రసాద్ కూడా ఉన్నారు. ఇకపోతే ఏ ఆర్ రెహ్మాన్ సంగీత అందిస్తున్న ఈ చిత్రం దివాళి కానుకగా అక్టోబర్ లో విడుదల కానుంది.

