విక్రమార్కుడు తరహాలో మల్టీ స్టారర్

బాహుబలి సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో చెప్పనవసరంలేదు. రాజమౌళి తన తర్వాతి మూవీపై అంతటా ఆసక్తి నెలకొనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టి.. తన నెక్ట్స్ ప్రాజెక్టుపై హింట్ ఇచ్చిన రాజమౌళి..అసలు సంగతి మాత్రం ఇంకా చెప్పనేలేదు. ఈ మల్టీ స్టారర్ పై అనేక రూమర్స్ వచ్చేసాయి.
మల్టీస్టారర్ ప్రాజెక్టుపై వస్తున్న కొత్త రూమర్ ఏంటంటే.. ఈ సినిమాలో వీళ్లిద్దరూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ అంట. వీళ్లిద్దరూ ఓ గ్రామీణ ప్రాంతంలో సబ్ ఇన్ స్పెక్టర్ రోల్స్ చేస్తారని అంటున్నారు. రాజమౌళి విక్రమార్కుడు మూవీలో పోలీస్ పాత్రను ఎంతటి శక్తివంతంగా చూపించాడో చూశాం. మళ్లీ ఇప్పుడు మల్టీ స్టారర్ లో చూపించపోతున్నాడు.
అయితే అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు స్టోరీ మాత్రమే అనుకున్నారట..ఇంకా కథను డెవలప్ చేయాల్సి ఉందట అని ఇంకో రూమర్ వచ్చి చేరింది. అందుకే ఈ సినిమా ముహూర్తానికి అక్టోబర్ వరకు టైం పెట్టుకున్నారని తెలుస్తుంది. మరి ఏది నిజమో రాజమౌళికే ఎరుక.

