వావ్ సూపర్ పిక్

అక్కినేని సమంత ఇప్పుడు ఏ మాత్రం సందర్భం దొరికినా.. తన భర్త నాగచైతన్యపై అపరిమితమైన ప్రేమను కురిపిస్తోంది. నిన్న చైతు బర్త్ డే కావడంతో.. సమంత ఇంకా ఉప్పొంగిపోయింది. దీంతో.. 'మై ఎవ్రీ థింగ్… నువ్వు కావాలనుకున్నవన్నీ దక్కాలని కోరుకుంటూనే.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.. భగవంతుడిని ఇదే కోరుకుంటాను'. అంటూ సోషల్ మీడియాలో ప్రేమతో ఒక పోస్ట్ చెయ్యడంతో పాటే... పెళ్లి సమయంలో చైతన్యని ముద్దాడుతున్న ఒక లవ్లీ పిక్ ని పోస్ట్ చేసింది. ఆ పిక్ ని చూసిన వారంతా నాగచైతన్య సో లక్కీ అని అంతా అంటున్నారు.
అలాగే ఇండస్ట్రీలోని చైతు సన్నిహితులు, స్నేహితులు అందరూ నాగ చైతన్య పుట్టిన రోజుకి బెస్ట్ విషెస్ తెలియజేసారు. అలాగే చైతు - సామ్ ల జంట కలకాలం ఇలాగే ఆనందంగా ఉండాలని కూడా విష్ చేస్తున్నారు. ఇకపోతే సమంత నాగ చైతన్యతో కేక్ కట్ చేయించి ఒక కేక్ పీస్ ని నాగ చైతన్య నోటిలో పెట్టి మిగిలిన కేక్ సమంత లాగించే ఒక వీడియో కూడా నిన్న గురువారం నెట్ లో హల్చల్ చేసింది. ఆ వీడియో ని చూసిన అందరూ సామ్ ఎంత ప్రేమగా చైతు పుట్టిన రోజు జరిపించింది అంటూ పొగిడేశారు.
ఇక నాగ చైతన్య కూడా తన పుట్టిన రోజుకి విషెస్ తెలిపిన అందరికి కృతఙ్ఞతలు తెలియజేస్తూ... లైఫ్ ఈజ్ గుడ్ అనే టాగ్ లైన్ తో తన భార్య సమంత తో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఆ ఫోటో చూస్తుంటే.. చైతు, సామ్ లు పెళ్లి తర్వాత ఎంత ఆనందంగా వున్నారో అర్ధమవుతుంది. ఇక ఆ లవ్లీ పిక్ ని చూసిన అక్కినేని అభిమానులు మాత్రం యమా ఖుషీగా పండగ చేసేసుకుంటున్నారు. మరి మీరు చైతు పోస్ట్ చేసిన ఆ పిక్ ని చూసి తరించండి.

