వావ్ పద్మావతి

సంజయ్ లీలా బన్సాలి నిర్మాణ.... దర్శకత్వంలో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం పద్మావతి. బాలీవుడ్ లో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. సంజయ్ లీలా బన్సాలి ఒక విలక్షణమైన దర్శకుడు. సంజయ్ లీల గత చిత్రాలతో పోలిస్తే 'పద్మావతి' అంతకుమించి ఘన విజయం సాధించవచ్చు అనిపిస్తోంది. దీపికా పదుకొనె, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్, అతిథి రావు మొదలైన వారితో నిర్మిస్తున్న పద్మావతి చిత్రంలోని తొలి పాటను సంజయ్ లీలా బన్సాలి బుధవారం విడుదల చేశాడు.
సంజయ్ లీలా బన్సాలి సంగీతాన్ని సమకూర్చగా శ్రేయ ఘోషల్ ఈ పాటను అద్భుతంగా పాడింది. రాజస్థాన్ లోని ఒక మహల్ లో దీపికతో పాటు అనేకమంది డాన్సర్స్ పాల్గొన్న ఈ పాటను అద్భుతంగా తెరకెక్కించారు. రాజ్ పుత్ మహిళల సంప్రదాయ నృత్యం ఇది. దీనిని ఘూమర్ అంటారు. చుట్టూ తిరుగుతూ చేసే నృత్యం ఇది. 'పద్మావతి' చిత్తోర్ గర్హ్ కు చెందిన మహారాణి. మహల్ విద్యుద్దీపాలతో మెరిసిపోతుండగా... దీపాలతో 'పద్మావతి'కి స్వాగతం పలుకుతున్న సన్నివేశాలతో పాటు దీపికా తన రెండు చేతుల మీద దీపాలను పెట్టుకొని గుండ్రంగా తిరుగుతూ డాన్స్ చేస్తున్న సీన్స్ మాత్రం నిజంగా అత్యద్భుతం.
ఈ పాటలో దీపిక పదుకొనె వేసుకున్న డ్రెస్సు, వాటికీ తాగగట్టుగా పెట్టుకున్న నగలు మాత్రం బాగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ పాటలో దీపికతో పాటు షాహిద్ కపూర్ కూడా ఉన్నాడు. ఈ పాట 'పద్మావతి' చిత్రంలో హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది.'పద్మావతి' చిత్రం డిసెంబర్ 1న విడుదల చేస్తున్నామని ఫస్ట్ లుక్ విడుదల రోజునే అధికారింగా ప్రకటించింది చిత్ర బృందం.

