వావ్.. చరణ్ భలే ఉన్నాడు!!

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కతున్న అచ్చమైన పల్లెఊరు ప్రేమ కథ 'రంగస్థలం 1985 ' చిత్రం షూటింగ్ రాజమండ్రి నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ గా పల్లెటూరి యువకుని పాత్ర పోషిస్తున్నాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో మొదటిసారి నటిస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రంలో కాస్త భిన్నంగా కనిపించనున్నాడు. ఇప్పటివరకు రామ్ చరణ్ చిత్రాలలో చరణ్ లుక్ ఒకలా ఉంటే ఇప్పుడు సుకుమార్ రంగస్థలం లోని రామ్ చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా వుంది.
ఇప్పటికే లీకైన ఫొటోస్ లో చరణ్ ఊర మాస్ గా కనిపిస్తుండగా... చరణ్ లుక్ ని సుకుమార్ మాత్రం టోటల్ గా చేంజ్ చేసేసాడు. ఇప్పుడు కూడా చరణ్, సుకుమార్ భుజంపై చెయ్యి వేసిన లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఆ పిక్ లో రామ్ చరణ్ మాత్రం 'నాన్నకు ప్రేమతో' లో ఎన్టీఆర్ లుక్ ని పోలి ఉన్నట్లే కనబడుతుంది. మరి ఒకపక్క మాస్ లుక్ తో మరో పక్క క్లాస్ లుక్ తో చరణ్ మాత్రం ఇరగదీస్తున్నాడని అంటున్నారు. బాగా కండలు పెంచిన పల్లెటూరి యువకుడుగా చరణ్ రంగస్థలంలో ఇరగదీస్తాడని మాత్రం ఈ పిక్ చూస్తుంటే అర్ధమవుతుంది .
ఇక ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.


