వారిద్దరినే ఎందుకు పొగుడుతోందంటే..?
రెజినా టాలీవుడ్ లో ఇప్పటివరకు ఒక పెద్ద హిట్ ని అందుకోలేదు. కానీ పెద్ద హిట్స్ లేకపోయినా కూడా ఈ భామ ఎప్పుడూ సినిమాలతో బిజీగానే ఉంటుంది. ఇక కొంచెం గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ గా కనిపించినా ఆమెకు పెద్ద హీరోల పక్కన ప్లేస్ దొరకడం లేదు. అయితే పెద్దగా అవకాశాలు చేతిలో లేని రెజినా ఇప్పుడు కొంతమంది స్టార్ హీరోలని పొగిడే కార్యక్రమం పెట్టుకుంది. ఆ హీరోలు ఎవరంటే మహేష్ బాబు, రామ్ చరణ్. వీరిద్దరూ మోస్ట్ సెక్సియెస్ట్ అంటూ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. వీరినే ఎందుకు రెజీనా సెక్సియెస్ట్ అంటూ దీర్ఘాలు తీసింది. ఇంకెవరూ అలా లేరా... ఆమె కంటికి వీరిద్దరే సెక్సియెస్ట్ గా కనబడ్డారా? అంటే ఏమో గాని రెజినా మాత్రం ఈ పొగిడే కార్యక్రమం మాత్రం ఎందుకు పెట్టుకుందో తెలుసా...
ఇప్పటిదాకా చిన్న చితక హీరోలతో నటించిన ఈమెకు ఇప్పుడు స్టార్ హీరోల పక్కన మెరవాలనుకుంటుంది. అందుకే ఇలా మోస్ట్ సెక్సియెస్ట్ అంటూ వారిద్దరిని పొగిడేస్తుందని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.అలాగే ఆ హీరోల పక్కన అవకాశం వస్తే ఎగిరి గంతేస్తానని అంటుంది. అంతేగా అంతా పెద్ద హీరోల పక్కన ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం ఎగిరి గంతెయ్యారు.