Mon Mar 30 2026 21:07:42 GMT+0530 (India Standard Time)
వారందరి కి హోల్సేల్ గా షాకిచ్చిన సూర్య

బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన స్పెషల్ ఛబ్బీస్ (స్పెషల్-26) సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని రెండేళ్ల నుండి వార్తలు వస్తూనే ఉన్నాయి. మొదట తెరపైకి వెంకటేష్, నాగార్జున పేర్లు వచ్చిన తర్వాత రవి తేజ కంఫర్మ్ అయ్యాడని వార్తలొచ్చాయి. కానీ ఇంకా ఆ సినిమా రీమేక్ అవ్వదు. కారణం తమిళ్ సినిమా 'గ్యాంగ్'.
నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దాదాపు 'స్పెషల్-26' కాన్సెప్ట్ తోనే తెరకెక్కిందని స్వయంగా ప్రకటించాడు దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమా గ్యాంగ్ అనే పేరుతో 2018 సంక్రాంతికి విడుదల అవుతుంది.
సో..గ్యాంగ్ సినిమా తెలుగులో రిలీజైతే ఇక స్పెషల్ ఛబ్బీస్ రీమేక్ ను ఎవరూ టేకప్ చేయకపోవచ్చు. మొత్తం మీద ఓ సూపర్ హిట్ సినిమాను నాగార్జున, వెంకటేష్, రవి తేజ మిస్ చేసుకున్నారు.
Next Story

