వామ్మో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది

సౌత్ హీరోయిన్స్ కి సౌత్ మీద కంటే ఎక్కువగా బాలీవడ్ మీదే మోజు ఎక్కువ ఉంటుంది. సౌత్ సినిమాలో నటిస్తున్నా ఎప్పుడూ వారి చూపు బాలీవుడ్ మూవీస్లో వచ్చే ఛాన్స్ ల మీదే ఉంటుంది. అయితే సౌత్ నుండి అలా బాలీవుడ్ లోకి వెళ్లి చేతులు కాల్చుకుని మళ్ళీ సౌత్ కే దిగబడ్డ హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. అయితే అలా సౌత్ నుండి వెళ్లిన భామలతో కొద్దిమంది మాత్రమే బాలీవుడ్ లో నిలదొక్కుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ హీరోయిన్స్ అందరిలో ఇలియానా కాస్త గట్టిగా బాలీవుడ్ లో ప్రయత్నించి ఇప్పటికే సక్సెస్ అయ్యింది. ఇక బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత కూడా ఇలియానా కొన్ని టాలీవుడ్ మూవీస్ లో నటించింది కూడా.
ఇకపోతే బాలీవుడ్ మూవీస్లో బిజీగా వున్న ఇలియానా ఒక ఫేమస్ ఫోటో గ్రాఫేర్ తో డీప్ లవ్ లో ఉందనే న్యూస్ ఎప్పటినుండో వినబడుతుంది. గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ ఆండ్ర్యూ నీబోన్ తో ప్రేమయనాన్ని కొనసాగిస్తున్న ఈ భామ.. అతనితో కలిసి విదేశాలకు, రెస్టారెంట్స్ కి గట్రా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ఆండ్ర్యూ నీబోన్ ఏ విషయంలో అయినా ప్రైవసీ గా ఉండడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాపడతాను అంటూ చెప్పుకొచ్చింది.
నేను సినిమా ఇండస్ట్రీలోకొచ్చి దాదాపు దశాబ్ద కాలం దాటిపోయింది. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో నేను చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమాల్లో నేను మెచ్చే పాత్రలు కూడా చేసాను. అలాగే కొన్ని పాత్రలు నాకు చాలా పేరు తెచ్చిపెట్టాయి కూడా. అలాగే కొన్ని విషయాల్లో ఏ తప్పు చేయకపోయినా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మరి నాతోపాటు నా బాయ్ ఫ్రెండ్ ఉంటె అతనికి అలాంటి ఇబ్బందులే తలెత్తుతాయి గాని..... ఇంకేం ఉండదు. అందుకే నా వల్ల ఆండ్ర్యూ నీబోన్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే ఇలా సీక్రెట్ గా ఉంటున్నామని చెప్పింది. అలాగే ఆండ్ర్యూ ఏ విషయాన్ని బహిర్గతం చేయడానికి అంతగా ఇష్టపడడు. అదే విధంగా ఆండ్ర్యూ ని కొందరు ఇండియాకి చెందిన వాడు కాదు అంటారు. అలా అనడం సరికాదు. అతనంటే నాకెంతో ఇష్టం అంటూ.. తన కుటుంబాన్ని ఎవరైనా వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పింది ఇలియానా.
ఇక పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ఇలియానా చెప్పిన సమాధానము వింటే మాత్రం దిమ్మ తిరగడం ఖాయం. అప్పుడే పెళ్లేమిటండి.... ఈ సహజీవనంతో మేమిద్దరం చాలా ఆనందంగా ఉన్నాము అంటూ.. పెళ్లికి ఆ రిలేషన్ కి చాలా తేడా ఉందని దిమ్మతిరిగే సమాదానం చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.

