వామ్మో కరీనా ...

బాలీవుడ్ మొత్తానికి జీరో సైజు శరీరాకృతిని పరిచయం చేసి టీనేజ్ కథానాయికల దగ్గర నుంచి మధ్య వయసు నాయికల వరకు అందరూ ఫిట్నెస్ విషయంలో తననే స్ఫూర్తిగా తీసుకునే స్థాయికి చేరుకున్న బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ ఏడాది కాలంగా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంటోంది. ఒక మగ బిడ్డకి జన్మనిచ్చి, డెలివరీ అయిననాటి నుంచి తన ఫిజిక్ షేప్ లని తిరిగి ఆకర్షణీయంగా మలచుకునే ప్రయత్నాలు అయితే చాలా కాలంగా చేస్తూనే వుంది.
మధ్యలో అడపాదడపా బాలీవుడ్ పార్టీస్ లో దర్శనమిచ్చిన కరీనా, ప్రసవం ఐన అతి తక్కువ రోజులకే ఫిట్ గా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఏకంగా మోడలింగ్, స్టేజ్ షోస్ పై గ్లామర్ షో లకి సిద్ధమైపోయింది. తాజాగా కరీనా కపూర్ పాల్గొన్న ఒమన్ దేశం లోని మోడలింగ్ షో లో ఆ దేశ సాంప్రదాయానికి తగిన దుస్తులలోనే కనిపించినప్పటికీ తన మార్క్ ఆకర్షణీయ గెస్టర్స్ తో అందరిని ఆకర్షించింది. ఈ ఫొటోస్ చూస్తున్న వారంతా వయసు పెరిగిన కరీనా అందచందాలు ఎంత మాత్రం తగ్గలేదని, కొంత విరామం తరువాత వీరే ది వెడ్డింగ్ ద్వారా వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న బెబో మళ్లీ అభిమానులని అమితంగా ఆకర్షించటం ఖాయం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


