వామ్మో ఆయన చేతిలోకి వెళితే ఇక అంతే

మొన్నామధ్యన ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకెక్కిస్తున్నట్లు బాలకృష్ణ అధికారిక ప్రకటన చేసాడు. తానే తన తండ్రి బయోపిక్ లో నటిస్తానని కూడా బాలయ్యే స్వయంగా ప్రకటించాడు. అయితే భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందిచాలనేది బాలయ్య ప్లాన్. మరి ఎన్టీఆర్ రాజకీయ రంగంలో, సినిమా రంగంలో తనదైన ముద్ర వేశారు. అలాంటి గొప్ప వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు బయో పిక్ ని తెరకెక్కించాలంటే ఎంతగా హార్డ్ వర్క్ చెయ్యాలో కూడా బాలకృష్ణ వివరించిన సంగతి తెలిసందే. మరి ఈ సినిమా గనక పట్టాలెక్కితే రికార్డులు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయ్.
మరి సినిమాల్లో ఎన్టీఆర్ వారసుడిగా ఆ బాధ్యతని బాలకృష్ణ తన భుజాల పైకి ఎత్తుకున్నాడు. తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో తొందరపడి ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని బాలయ్య అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆలస్యమైనా పక్కా ప్లాన్ తో ఈ చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నాడు. అందుకే బాలకృష్ణ ఎన్టీఆర్ బయో పిక్ ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించే డైరెక్టర్ వేటలో ఉన్నాడట.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బయో పిక్ కి దర్శకుడిగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల పైసా వసూల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు. బాలకృష్ణ, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని పూరి తెలిపాడు. ఆ చిత్రం ఎన్టీఆర్ బయోపికే అయి ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి
మరి రామ్ గోపాల్ వర్మ యదార్థ గాధల ఆధారంగా చిత్రాలను తెరకెక్కించడంలో ఘటికుడు. అయితే అసలు ఈ మధ్య కాలంలో వర్మ వరస పరాజయాలతో కొట్టుకుపోయాడు. మరి అలంటి దర్శకుడికి ఎన్టీఆర్ బయో పిక్ ని తెరకేకించే అవకాశం బాల్లయ్య ఇవ్వడనే అభిప్రాయాన్ని నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

