Tue Mar 31 2026 17:00:57 GMT+0530 (India Standard Time)
వర్మ సైలెంట్ గా ఉండటానికి కారణం అతనా...

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య చాలా సైలెంట్ కావడం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్‌గా మారింది. ట్రెండ్ కు తగ్గట్టు తనదైన శైలిలో విమర్శలు చేసే వర్మ ఒకేసారి సైలెంట్ అయిపోవడం వలన సోషల్ మీడియా చప్పగా మారిందని సెటైర్లు కూడా వేస్తున్నారు.
ఇవాంకా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పవన్ టూర్ వరకు వర్మ కామెంట్స్ చేయలేదు. అయితే వర్మ ఇలా సైలెంట్‌గా ఉండటానికి కారణం నాగార్జున నే అని టాక్ వినిపిస్తుంది. అవును నాగ్ తన సినిమా కంప్లీట్ అయ్యేవరకు సైలెంట్ గా ఉండమని వర్మకి సలహా ఇచ్చాడని తెలుస్తుంది.
ప్రస్తుతం నాగ్ - వర్మ కంబినేషన్ లో ఓ సినిమా పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. శివ సినిమా తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు వున్నాయి
Next Story

