వర్మ కోసం నాగ్ త్యాగం

నాగార్జున తాను కమిట్ అయిన చిత్రాలలో తన పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటుందో.. అది ప్రేక్షకులకు ఏ మేర కనెక్ట్ అవుతుందో అని బాగా ఆలోచిస్తాడు. తనకి పాత్ర తీరు తెన్నులు నచ్చితే వెంటనే సినిమా చేసేస్తాడు. ఇప్పుడు కూడా తాజాగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సినిమాకి ఓకే చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. అస్సలు ఫామ్ లో లేని వర్మకి నాగ్ పిలిచి అవకాశం ఇచ్చేసరికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కిపడింది. కానీ నాగార్జునకు రామ్ గోపాల్ చెప్పిన కథలో ఏం నచ్చి ఓకే చేసాడో అని కూడా ఆలోచించారు. శివ లాంటి అద్భుతమైన హిట్ అందించిన వర్మతో నాగ్ మళ్ళీ ఇన్నాళ్లకు ఇలా ఒక సినిమా అవకాశం ఇవ్వడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే గత పదేళ్లుగా హిట్ మొహమెరగని వర్మ.. నాగార్జున ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే నాగార్జున పాత్రని ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు తన నుండి నాగ్ నుండి ఇలాంటి సినిమా రాలేదని.... ఇప్పుడు మా కలయికలో తెరకెక్కే సినిమా కొత్తగా ఉంటుందని వర్మ ఎప్పటినుండో చెబుతున్నాడు. ఈ సినిమాలో నాగ్ లుక్ దగ్గర నుండి అన్ని విషయాల్లోనూ వర్మ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నాడట. ఈ కొత్త లుక్ కోసం వర్మ నాగ్ ని బాగానే కష్టపెడుతున్నాడట. వర్మ సినిమా కోసం నాగార్జున కండలు పెంచి.. టఫ్ కాప్ లుక్ లోకి మారేందుకు శ్రమిస్తున్నాడట.
తన వయసు 60 కి చేరువలో ఉన్నాకూడా... ఆ వయసుని ఎట్టి పరిస్థితుల్లో బయటికి కనబడనీయని నాగ్.... ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఫిట్నెస్ లో అంత పర్ఫెక్ట్ గా వుండే నాగ్... వర్మ సినిమా కోసం జిమ్ లో మరింత కష్టపడుతూ దాదాపుగా సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారిపోబోతున్నాడట. ఇక రామ్ గోపాల్ వర్మ - నాగార్జున ల సినిమా ఈ నెల 20 న మొదలెట్టుకుని వెంటనే సెట్స్ మీదకెళ్లబోతుందట.

