Sun Dec 21 2025 19:18:17 GMT+0000 (Coordinated Universal Time)
వరుస విజయాలు తెచ్చే సెంటిమెంట్

యువ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ వంటి గ్రాండ్ సక్సెస్ తరువాత తన ఉనికిని కాపాడుకోవటానికి అనేక చిత్రాలు నటించాడు. వాటిల్లో యువత ఒకటి పరువాలేధనిపించుకుంది కానీ మిగిలిన అటెంప్ట్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. దీనితో నిఖిల్ కెరీర్ బాగా నెమ్మదించింది. ఈ తరుణంలో ఒక్క సక్సెస్ నిఖిల్ గమ్యాన్ని మార్చేసింది. అదే 2012 లో విడుదల అయిన స్వామి రారా చిత్రం. ఈ చిత్రం తరువాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాలతో హ్యాట్ట్రిక్ అందుకున్న నిఖిల్ కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య చిత్రాల కథలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సైన్స్ ఇంవోల్వ్మెంట్ వుంది.
తాజాగా శంకరాభరణం తాలూకా చేదు జ్ఞాపకాల నుంచి ఎక్కడికి పోతావు చిన్నవాడా విజయంతో బైట పడి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ ఇచ్చాడు నిఖిల్. అనూహ్యంగా ఈ చిత్ర కథలోనూ సైన్స్ ప్రమేయం కనపడుతుంది. కొందరికి ఫ్యాక్షన్ స్టోరీస్, కొందరికి పోలీస్ స్టోరీస్, కొందరికి హారర్ స్టోరీస్ కలిసి వచ్చినట్లు నిఖిల్ కి సైంటిఫిక్ లోగిక్స్ చుట్టూ నడిచే కథలు కలిసివస్తునట్టు కనపడుతున్నాయి. కెరీర్ ఫామ్ లోకి తెచ్చుకున్న నిఖిల్ కి ఈ సెంటిమెంట్ కూడా పెద్ద ముప్పు లానే కనిపిస్తుంది. నిఖిల్ కి కథ సిద్ధం చేసే ప్రతి రచయిత ఇదే కోణంలోకి వెళ్ళిపోతే మళ్లీ మూస పద్ధతిలోకి వెళ్ళిపోతాడు నిఖిల్. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న నిఖిల్ తన అనుభవంతో అంత వరకు తెచ్చుకోడు అనే ఆశిద్దాం.
Next Story

