వరుణ్ తేజ్ కూడా టచ్ చేసాడు!

గత ఏడాది ‘ఫిదా’ చిత్రంతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఈ ఏడాది ‘తొలిప్రేమ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో ముందుకెళ్లి బాక్స్ ఆఫిస్ వద్ద విజయం సాధించింది. వరుణ్ తేజ్ తొలిప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు... అమెరికాలో కూడా అదరగొట్టాడు. అక్కడ అమెరికాలో తొలిప్రేమ 1మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది. సినిమా కలెక్షన్లలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ఓవర్సీస్ కలెక్షన్లలో కూడా ఈ చిత్రం సత్తా చాటి అమెరికాలో కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
‘ఫిదా’ చిత్రంతో తొలిసారి అమెరికాలో 1 మిలియన్ డాలర్ల కలెక్షన్ల క్లబ్ లో చేరిన వరుణ్.. తొలిప్రేమ చిత్రంతో వరుసగా రెండోసారి ఈ క్లబ్ లో చేరాడు. వరుణ్ తేజ్, రాశిఖన్నా , ప్రియదర్శి , ఆది నటించిన ‘తొలిప్రేమ’ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మరి వెంకీ అట్లూరి మనసుకు హత్తుకునే డైలాగ్స్, ఎమోషన్ ని పండిపండించనట్లుగా పండించి సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టి హిట్ కొట్టాడు. ఈ విజయంతో వరుణ్ తేజ్ మార్కెట్ వాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అలాగే హీరోయిన్ రాశి ఖన్నాకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

