వరుణ్ - అదితి జోడీ బాగానేవుంటుందా ?

మెగా ఫ్యామిలీ లో వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఊపుమీద ఉన్నాడు. వరసగా రెండు హిట్స్ తో దూసుకుపోతున్నాడు. గత ఏడాది 'ఫిదా'తో.. ఈ ఏడాది స్టార్టింగ్ లో 'తొలిప్రేమ' తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అదే ఊపుతో ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు.
తెలుగులో స్పేస్ ఫిల్మ్ రావడం ఇదే మొదటిసారి. ఈ చిత్రానికి సంబంధించి జార్జియాలో స్పేస్ సెట్ కూడా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి అదితిరావు హైదరి వరుణ్ కు జోడీగా నటించనుందట.
మణిరత్నం డైరెక్షన్ లో వచ్చినా ‘చెలియా’ తర్వాత మోహనకృష్ణ డైరెక్షన్ లో సుధీర్ బాబుకు పక్కన ‘సమ్మోహనం’ అనే సినిమాలో నటిస్తుంది. హైదరాబాదీనే అయిన ఈ అమ్మాయిని వరుణ్ సినిమాకు దర్శకుడు సంకల్ప్ ఓకే చేశాడట. అయితే అదితి వరుణ్ పక్కన పెద్దదైపోతుందేమో అన్న సందేహాలు లేకపోలేదు. వరుణ్ చూడటానికి చాలా ఎత్తుగా కనపడతాడు కానీ వయసు 28 ఏళ్లే. కానీ అదితి వయసేమో 31 ఏళ్లు. హీరోల కన్న హీరోయిన్ లా వయసు ఎక్కువగా ఉండే సందర్భాలు గతంలో లేకపోలేదు. కానీ అదితి వరుణ్ ముందు కొంచెం పెద్దగానే కనిపించే అవకాశం ఉంది. చూద్దాం ఈ జోడి స్క్రీన్ పైన ఎలా ఉంటుందో.

