లీకులతో సతమతమవుతున్న బాలీవుడ్ హీరో

ఏ భాషలో సినిమాలు తెరకెక్కుతున్న ఆ సినిమాల షూటింగ్ స్పాట్ నుండి ఆ సినిమాకు సంబందించిన ఫొటోస్ అయినా లేకుంటే ఆ సన్నివేశాల వీడియోస్ అయినా లీకైపోయి దర్శక నిర్మాతలకు... చిత్ర బృందానికి వెన్నులో ఒణుకు తెప్పిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి అంతటివాడికే ఈ లీకుల ఇబ్బంది తప్పలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ లీకులతో బాలీవుడ్ హీరో ఒకరు బాగా సతమతమవుతున్నారట. ఆయనెవరో కాదు కండల వీరుడు సల్మాన్ ఖాన్.
సల్మాన్ ఖాన్ సినిమా తెరకెక్కుతుంది అంటేనే సినిమాపై భారీ అంచనాలుంటాయి. ఎప్పుడెప్పుడు సల్మాన్ లుక్ చూద్దామా అని సల్మాన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు బాలీవుడ్ జనమంతా సల్మాన్ సినిమాల మీద ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఇపుడు తాజాగా సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ జిందా హై సినిమా కి సంబందించిన లీకులు సల్మాన్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఈ సినిమా లీకుల్లో రికార్డు సృష్టించేలా కనబడుతుంది అంటున్నారు.
ఎందుకంటే సల్మాన్ టైగర్ జిందా హై సినిమా షూటింగ్ ఎక్కడ ఏ ప్రదేశంలో జరిగినా అది వీడియో లేకుంటే ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయట. ఇప్పుడు కూడా లండన్ లో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ లో యాక్షన్ బ్లాక్ కు సంబంధించి కీలకమైన విజువల్స్ ను లీకుచేసేశారట. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కాదు... టైగర్ జిందా హై సినిమాకు సంబంధించి ఇలాంటివి దాదాపు 6 క్లిప్స్ నెట్ లోకి వచ్చేసాయంటున్నారు. ఇక ఈ లీకులతో సల్మాన్ కి పిచ్చెక్కిపోతుంది. ఇప్పటికే ట్యూబ్ లైట్ విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పట్లో సినిమా విడుదలకు ముందు సగానికి సగం సినిమా ని నెట్ లో పెట్టి సల్మాన్ కొంప ముంచేశారు లీకేజి రాయుళ్లు.
ఇక ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది అది వేరే విషయం. మరి ఇప్పుడు ఈ టైగర్ జిందా హై చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మరి ఇంత అంచాలున్న ఈ చిత్రానికి సంబందించిన ఈ లీకులు సినిమాపై ప్రభావం చూపుతాయంటున్నారు బాలీవుడ్ నిపుణులు.

