లావణ్య త్రిపాఠి తొలిముద్దు హీరో ఎవరో తెలుసా..

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన లావణ్య త్వరగా నాకు పెళ్లి చేసేయండి నాన్న అనే డైలాగ్‌తో తెలుగు ప్రజల హృదయాల్లో అలా నిలిచిపోయింది. అందాల రాక్షసి సినిమాలో ఆమె చెప్పిన ఈ ఒక్క డైలాగ్ ఎంతోమంది పెళ్లికాని ఆడపిల్లల కోరికను తెలియజెప్పింది. ఆ సినిమా తర్వాత లావణ్యకు తెలుగులో మంచి ఛాన్సులే వచ్చాయి. మంచి హిట్లు కూడా కొట్టింది. అయితే లావణ్యకు ఇటీవల టైం ఏ మాత్రం కలిసిరావడం లేదు.
లావణ్యకు ప్రస్తుతం బ్యాడ్ టైం పట్టుకుంది. వరుసపెట్టి చేసిన సినిమాలన్నీ ప్లాపుల మీద ప్లాపులు అవుతున్నాయి. అయినా ఆమె మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఛాన్సులు మాత్రం పట్టేస్తోంది. లావణ్య తన తాజా ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలు భయటపెట్టింది. తాను గతంతో మిస్ ఉత్తరాఖండ్ పోటీల్లో విజయం సాధించి, ఆ తర్వాత మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పింది.
ఇక తన తొలి ముద్దు అనుభవం గురించి కూడా ఆమె భయటపెట్టింది. ఇంతకు లావణ్య తొలి ముద్దు హీరో ఎవరో కాదు మన నేచురల్‌స్టార్ నాని. నాని - లావణ్య కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాలో లావణ్య నాని బుగ్గపై ముద్దు పెట్టింది. ఇదే తనకు తొలి ముద్దని లావణ్య చెప్పింది. ఇక ర్యాంప్‌పై తాను తొలివాక్ చేసినప్పుడు ఇచ్చిన రూ.5000 రెమ్యునరేషన్‌ను అమ్మకే ఇచ్చానని నాటి గుర్తులను లావణ్య నెమరువేసుకుంది.

