లావణ్య ప్లేస్ లోకి షాలిని

తెలుగు లో సుకుమార్, నాగ చైతన్య, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన సినిమా '100% లవ్' ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. తెలుగు యూత్ లో ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాని ఇప్పుడు తమిళ్ లో జివి ప్రకాష్ హీరోగా '100% కాదల్' గా రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో జివి ప్రకాష్ కి జోడిగా మొదటగా తమన్నానే తీసుకుందామనుకున్నారు. కానీ తమన్నా ఎందుకులే అనుకున్నారో ఏమో... మళ్ళీ హెబ్బా పటేల్ అయితే బావుంటుందని అనుకున్నారు. కానీ చివరికి లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి.
ఇక దర్శక నిర్మాతలు కూడా లావణ్యకు ఫిక్స్ అయ్యారు. కానీ ఆమె తాజాగా '100 కాదల్' నుండి హటత్తుగా తప్పుకోవడంతో డైలమాలో పడిన నిర్మాతలు ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమాతో మంచి ఫారం లోకొచ్చిన షాలిని పాండే ని ఫైనల్ చేసుకున్నారట. అయితే ఈ తమిళ రీమేక్ ని సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన చంద్రమౌళి డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటించిన శాలిని పాండే నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెకు ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమనుండి వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి.
ఇప్పటికే నాగ్ అశ్విన్ మహానటి సినిమాలో సైతం సావిత్రి స్నేహితురాలు జమున పాత్రలో షాలిని పాండే ని తీసుకున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో..... ఇప్పుడు ఈ తమిళ రీమేక్ లో కూడా లావణ్య త్రిపాటి పుణ్యమా అని షాలినికి హీరోయిన్ ఛాన్స్ వచ్చేసింది. అలాగే తెలుగులో షాలినికి కొంత మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బ్లాక్ చేయించుకున్నారనే టాక్ వినబడుతుంది. మొత్తానికి అర్జున్ రెడ్డి సినిమా హిట్ తో షాలిని పాండే దశ తిరిగింది అని చెప్పొచ్చు.

