రొమాంటిక్ పోస్టర్ అదుర్స్!!

కొత్త దర్శకుడు ఉపేంద్ర డైరెక్షన్ లో హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'ఎంఎల్ఏ' అని టైటిల్ ఫిక్స్ చేసారు. కళ్యాణ్ రామ్ కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. నిన్న ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసారు టీం.
మార్చి 23న విడుదల....
కాజల్ అగర్వాల్ కు స్పూన్ తో ఫీడ్ చేస్తోన్న కళ్యాణ్ రామ్ పిక్ వీక్షకులను ఆకర్షిస్తోంది. రొమాంటిక్ ఫీల్ ఇస్తున్న ఈ పోస్టర్ లో కాజల్ ప్రదర్శించిన హావభావాలు యువ హృదయాలను కొల్లగుడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు. మార్చి 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
టీజర్ పెద్దగా.....
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి ప్రొమోషన్స్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. లేటెస్ట్ కళ్యాణ్ రామ్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ టీజర్ రిలీజ్ చేసారు కానీ సినిమాపై అంచనాలని ఎమ్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఈ రొమాంటిక్ పోస్టర్ మాత్రం కావల్సినంత ఎనర్జీని ఇచ్చింది. త్వరలోనే ఆడియో సాంగ్స్ ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారంట చిత్ర యూనిట్.
- Tags
- ఎంఎల్ఎ

