రెహమాన్ పేరు చెబితేనే పారిపోతున్నారు

ఏ ఆర్ రెహమాన్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు అంటే ఆ సినిమాపై పిచ్చ క్రేజ్ ఏర్పడేది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజికల్ హిట్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్రస్తుతానికి భారీ బడ్జెట్ సినిమాలే ఒప్పుకుంటున్న రెహమాన్ ఈ మధ్యన తెలుగులో ఒప్పుకున్న సై రా ప్రాజెక్ట్ నుండి అర్దాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే రెహ్మాన్ సై రా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే బెటర్ అని... మెగా అభిమానుల ఫీలింగ్. ఎందుకంటే ఈ మధ్యన రెహ్మాన్ సినిమాలకు ఇచ్చే మ్యూజిక్ సో.. సో గా వుంటుందనే ఫీలింగ్ వచ్చేసింది.
అసలు రెహ్మాన్ సంగీతం అంటేనే ప్రేక్షకులు ఒక విధంగా భయపడే స్టేజ్ లో ఉన్నారనే మాట మాత్రం సోషల్ మీడియాలో కాస్త గట్టిగానే వినబడుతుంది. అయితే రెహ్మాన్ మ్యూజిక్ కి ఎంతగా బోర్ కొట్టకపోతే స్టార్ హీరోల అభిమానులు అంతలా భయపడతారు. ఇప్పుడు కోలీవుడ్ లో ఒక హీరో భిమానులు ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ పై సెటైర్స్ వేస్తున్నారు. విషయం ఏమిటంటే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మురుగదాస్ కలయికలో వస్తున్నా సినిమాకి ఏ ఆర్ రెహ్మాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారు. ఇక విజయ్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా బాబోయ్ ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ వద్దంటే వద్దంటూ తమ హీరో కి సోషల్ మీడియా సాక్షిగా రిక్వెస్ట్ పెట్టడమే కాదు... రెహ్మాన్ స్థానంలో కోలీవుడ్ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని తీసుకోమంటూ సలహాలు కూడా పడేస్తున్నారు. మరి ఈ లెక్కన రెహ్మాన్ పని ఇక అయిపోయినట్లేనా....?

