రుమర్ పై స్పందించిన ప్రియాంక

ఎప్పుడు ఏదొ ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో నానుతూ ఉంటుంది ప్రియాంక చోప్రా. రీసెంట్ గా ఈ అమ్మడు మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది. ఈమె ఓ అవార్డ్ ఫంక్షన్ లో పెర్ఫామెన్స్ కోసం హెవీగా ఛార్జ్ చేసిందనే గాసిప్స్..... ఈ ప్రోగ్రాం కోసం అక్షరాలా 6 కోట్లు వసూల్ చేసిందని టాక్.
ఓ ఈవెంట్ లో 6 నిమిషాల పాటు డాన్స్ ప్రదర్శన కోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలను ప్రియాంక చోప్రా వసూలు చేసింది. అంటే నిమిషానికి కోటి చొప్పున పారితోషికం పుచ్చుకుంటోందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పుడు ప్రియాంక చోప్రా స్పందించింది.
నేను చెప్పేది ఏంటంటే.. '6 నిమిషాలు కాదు.. 12 నిమిషాల పాటు ఉండే ప్రదర్శన అది. నేను ఈ ప్రదర్శన కోసం బుర్జ్ ఖలీఫా పై నుంచి 700 మీటర్లు కిందకు జారాల్సి ఉంటుంది' అని చెప్పింది ప్రియాంక చోప్రా. అందుకే నేను అంత వసూలు చేశానని చెప్పకనే చెప్పింది కానీ.... ప్రియాంక రెమ్యూనరేషన్ గుట్టు మాత్రం విప్పలేదు

