రికార్డుల వేటలో అజ్ఞాతవాసి

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి అనే చిత్రంలో నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రం 25వ చిత్రం కావడం విశేషం. అజ్ఞాతవాసి అనే టైటిల్ ని ఇంకా అనౌన్స్ చేయకముందే.... ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. ప్రో రిలీజ్ బిజినెస్ లోనే రికార్డులు సృష్టిస్తుంది అనుకుంటే ఇప్పుడు శాటిలైట్స్ రైట్స్ లోను పవన్ - త్రివిక్రమ్ సినిమా రికార్డుల మోట మోగిస్తుంది. మామూలుగానే పవన్ సినిమాలకు శాటిలైట్ రైట్స్ విభాగంలో భారీ డిమాండ్ ఉంటుంది. దానికి త్రివిక్రమ్ కూడా యాడ్ అయితే ఆ రేటు మరింత పెరగడం ఖాయం.
అసలు త్రివిక్రమ్ సినిమాలు తెరపై ఎంత హిట్ అవుతాయో.. టీవీల్లో టీఆర్పీ విషయంలో కూడా అంతే స్ట్రాంగ్. అందుకే ఈ డైరక్టర్ తీసే సినిమాల్ని ఏ ఛానెల్ మిస్ చేసుకోవాలనుకోదు... కాబట్టే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమా కోసం ఆయా ఛానల్స్ పోటీ పడుతుంటాయి. ఇప్పుడు అజ్ఞాతవాసి విషయంలోనూ సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. పవన్ - త్రివిక్రమ్ కలయికలో వస్తున్నా ఈ సినిమా శాటిలైట్ విభాగంలో హాట్ కేక్ గా మారింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి తీసిన అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఈసారి వీళ్లు చేస్తున్న అజ్ఞాతవాసి సినిమా శాటిలైట్ రైట్స్ ధర కొండెక్కి కూర్చుంది.
అయితే ఈ ధర 14 కోట్ల రూపాయల నుంచి ప్రారంభమైన శాటిలైట్ బిడ్డింగ్.. ఫైనల్ గా 19 కోట్ల 50లక్షల రూపాయలకు ఫిక్స్ అయింది. జీ తెలుగు, స్టార్ మా, జెమిని ఛానల్స్ మధ్యన ఏర్పడిన భారీ కాంపిటిషన్ మధ్య జెమినీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్.. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. జీ తెలుగు ఛానెల్ ఆఖరి నిమిషం వరకు పోటీపడినప్పటికీ ఫైనల్ గా జెమినీనే పవన్ అజ్ఞాతవాసి సినిమా వరించింది.

