రామ్ పరిస్థితేమి బాలేదు

ఎన్నో పరాజయాల తర్వాత 'నేను శైలజ' సినిమాతో ట్రాక్ లోకి వచ్చాడు అనుకున్న హీరో రామ్ 'హైపర్' సినిమాతో బాగా దెబ్బతిన్నాడు. అందుకే మళ్ళీ 'నేను శైలజ' కాంబినేషన్ అయితే రిపీట్ చేసాడు కానీ... సక్సెస్ ని మాత్రం రిపీట్ చేయలేకపోయాడు. రామ్ - కిషోర్ తిరుమల కలయికలో తెరకెక్కిన 'ఉన్నది ఒకటే జిందగీ' మిశ్రమ స్పందనతో పర్వాలేదనిపించినా కలెక్షన్స్ మాత్రం డల్ అంటున్నారు. సినిమా ఫర్లేదు అనిపించుకుంది కానీ బి సి సెంటర్స్ లో మెప్పించలేకపోయింది. తోలి రోజే సీడెడ్ లో ప్లాప్ టాక్ నడిచింది. ఆంధ్రాలో ఫర్లేదు అనిపించుకున్న ఈ సినిమా బి సి సెంటర్స్ లో డల్ అయింది.
సినిమా అనుకున్నట్టుగా ఆడకపోవడంతో షేర్స్ కూడా పెద్దగా రావట్లేదు. నైజాంలో అదీ ముఖ్యంగా హైదరాబాద్ లో బాగానే ఫలితాలు ఇచ్చింది ఈ సినిమా. ఇక ఆంధ్రలో మేజర్ సెంటర్లలో ఫరవాలేదు అనిపించింది. కానీ సోమవారం నాటికీ సినిమా బాగా డల్ అయిపోయింది. అమ్మిన రేట్స్ వస్తాయో రావో అన్న అనుమానం కూడా వుంది. రెండు మూడు ఏరియాలు నిర్మాత దగ్గర వున్నా... మిగిలిన ఏరియాలన్ని అమ్మేశారు.
ఓవర్సీస్ బయ్యర్స్ చాలా వరకు సినిమాను ముందే అమ్మేసుకున్నారు కాబట్టి సేఫ్ అయ్యారు. కానీ కొనుక్కున్న వాళ్లకు నష్టమే. ఈ బయ్యర్ల డబ్బు నష్టాల మాట ఎలా వున్నా.... నిర్మాత స్రవంతి రవికిషోర్ కు లాభమే. ఇకపోతే దిల్ రాజు నిర్మాణంలో చేసే సినిమా కన్నా హీరో రామ్ ఘాటెక్కుతాడేమో చూడాలి.

