రామ్ చరణ్ లో మరో యాంగిల్!!

రామ్ చరణ్ బాగా డాన్స్ వేస్తాడని తెలుసు. ఫైట్స్ కూడా బాగా చేస్తాడు అని తెలుసు. యాక్టింగ్ కూడా బాగా చేస్తాడు అని తెలుసు. హార్స్ రైడింగ్ కూడా బాగా చేస్తాడని తెలుసు. అయితే అతడిలో మరో కొత్త యాంగిల్ ను బయట పెట్టనున్నాడు డైరెక్టర్ సుకుమార్.
కామెడీతోనూ...
రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లో కామెడీ యాంగిల్ ను చూపించనున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలో చెవిటివాడిగా చరణ్ నటిస్తున్నాడు. ఈ పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా సమంత - చరణ్ మధ్య సాగే సంభాషణలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతాయని అంటున్నారు. సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పంచే నవ్వులు మామూలుగా ఉండవని చెబుతున్నారు రంగస్థలం చిత్ర బృందంలోని కొందరు.
మెగా ఫ్యాన్స్ కు పండగే....
చరణ్ కామెడీ టైమింగ్ కచ్చితంగా మెగా ఫాన్స్ కి మాత్రమే కాకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ ఎంతవరకు నవ్విస్తాడో తెలియాలంటే మార్చి ఆఖరు వరకు ఆగాల్సిందే. ఈ దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు రెడీ అవుతుంది.
- Tags
- రామ్ చరణ్

