రామ్ చరణ్ కి విలన్ గా తగులుకున్నాడే

రామ్ చరణ్-సుకుమార్ కలయికలో తెరెకెక్కుతున్న రంగస్థలం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని... ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీగా వుంది. పూర్తి స్థాయి పల్లెటూరి నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ చిట్టి బాబు పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రంగస్థలం ఫస్ట్ లుక్ లో రామ్ చరణ్ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తరువాత రామ్ చరణ్... బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక మూవీ లో నటించనున్నాడు.
బోయపాటి - రామ్ చరణ్ సినిమాకి పూజ కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇదిలా ఉంటే బోయపాటి డైరెక్టన్ లో వచ్చే సినిమాలన్నీ పక్క మాస్ చిత్రాలుగానే ఉంటాయి. ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ కి, ఫైట్ సీన్స్ కి అస్సలు కొదవ ఉండదు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ తో రూపొందిస్తున్న సినిమా లో ఫైట్ సీన్స్ బ్రహ్మాండంగా ఉంటాయట. అయితే ఈ సినిమా లో రామ్ చరణ్ కి విలన్ గా బాలీవుడ్ హీరో అయిన వివేక్ ఒబెరాయ్ ని తీసుకురాబోతున్నాడట బోయపాటి.
మరి బాలీవుడ్ నుండి రామ్ చరణ్ కోసం బోయపాటి విలన్ ని గట్టిగానే సెట్ చేసాడు అని అర్ధం అవుతుంది. అలాగే ఈ సినిమా కోసం రామ్ చరణ్ త్వరలో లుక్ కూడా చేంజ్ చేస్తాడు అని సమాచారం అందుతుంది.

