రామ్ చరణ్ కి దిమ్మతిరిగింది!!

ఖైదీ నెంబర్ 150 ' ఘన విజయం తర్వాత చిరంజీవి నటిస్తున్న మూవీ 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' కావడంతో ఈ చిత్రం ఇంకా మొదలుకాకముందే భారి అంచనాలు నెలకొన్నాయి. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని అతిత్వరలోనే పట్టాలెక్కించేందుకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ లు రెడీ అవుతున్నారు. పక్కాగా స్క్రిప్ట్ ని లాక్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన చిత్ర యూనిట్ నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేసినట్లు వార్తలొస్తున్నాయి.
చిరంజీవి పక్కన ముగ్గురు హీరోయిన్స్ఉయ్యాలవాడలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మూడు భాషలో విడుదల చెయ్యాలని చూస్తున్న ఈ చిత్రంలో చిరు పక్కన బాలీవుడ్ భామ ఐశ్వర్య రాయ్, అనుష్క శెట్టి, నయనతారలు ఎంపికైనట్టు... ఈ విషయాన్ని ఉయ్యాలవాడ చిత్రం మొదలుపెట్టే రోజేనే ఎనౌన్స్ చేయనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఐష్ విషయంలో చిత్ర యూనిట్ మల్లగుల్లాలు పడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే ఉయ్యాలవాడ చిత్రంలో చిరు పక్కన నటించేందుకు ఐష్ సుముఖంగా ఉన్నప్పటికీ ఆ పాత్ర చెయ్యడానికి ఐశ్వర్య రాయ్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఏకంగా 9 కోట్లు డిమాండ్ చేసేసరికి రామ్ చరణ్ కి దిమ్మతిరిగి బొమ్మ కనబడింది.... అందుకే ఐష్ విషయంలో ఉయ్యాలవాడ టీమ్ పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. మరి ఐశ్వర్య అయితే హిందీలో ఉయ్యాలవాడ కి మంచి పబ్లిసిటీ ఉంటుందని భావించిన టీమ్ కి ఇప్పుడు ఆమె అడిగిన రేటు చూసి ఖంగు తిన్నారని అంటున్నారు. ఐష్ అడిగిన డబ్భుని రామ్ చరణ్ పే చేస్తాడా? లేకపోతె ఆమె స్థానంలోకి మరో బాలీవుడ్ భామని దింపుతాడో చూద్దాం.

