రామ్ చరణ్ ఒక ప్రాంక్ గై అంటున్న హీరోయిన్

బ్రూస్ లీ పరాభవం తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చాలా కాలం విరామం తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కొట్టాలని కథ విషయంలోనే తీవ్రంగా శ్రమించి తన్ని ఉరువన్ కథకి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు కథనంలో మార్పులు చేపించటంతో పాటు కాస్టింగ్ విషయంలోనూ రాజీపడకుండా తమిళ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్ర పోషించిన అరవింద్ స్వామినే పలు చర్చల అనంతరం ఒప్పించి తెలుగులోనూ నటింపజేశారు. ఎట్టకేలకు వాయిదాల అనంతరం విడుదలకు దగ్గర పడటంతో రామ్ చరణ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ లు ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు.
ఈ ఏడాది నాన్నకు ప్రేమతో, సరైనోడు చిత్రాలతో సక్సెస్ ట్రాక్‌లో వున్న రకుల్ ధ్రువ చిత్రంతోనూ సక్సెస్ కొట్టి బ్రూస్ లీ డిసాస్టర్ సెంటిమెంట్ ని తొలగించుకోవాలని తాపత్రయ పడుతుంది. ధ్రువ సక్సెస్ పై బలమైన విశ్వాసం వ్యక్తం చేస్తున్న రకుల్ తన కో స్టార్ గురించి కొన్ని నిజాలను పంచుకుంది. "రామ్ చరణ్ తేజ్ స్క్రీన్ మీద కనిపించినంత డిగ్నిఫైడ్ గా ఆఫ్ స్క్రీన్ ఉండడు. సెట్స్ లో అందరూ సిద్ధంగా వున్నప్పుడు వచ్చి లొకేషన్ మారింది ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి అని, కాస్ట్యూమ్ తో రెడీగా వున్నప్పుడు చెయ్యబోయే షాట్ కి కాస్ట్యూమ్ ఇది కాదు అని, మేకప్ తీసేసిన తరువాత షూటింగ్ అయిపోలేదు ఇంక కొనసాగనుంది అని చెప్పేవాడు. అయితే చెర్రీ చెప్పేవి అన్ని వాస్తవానికి దూరమే. ఎప్పుడు ఇతర నటుల దగ్గర ఇలానే ప్రాంక్ చేస్తూ అందరిని టెన్షన్ పెడుతుంటాడు. అతని జాబ్ మాత్రం అతను ఏ మాత్రం ఆందోళన పడకుండా కూల్ గా పూర్తి చేసుకుంటాడు." అని చెర్రీ ప్రవర్తనకు సంబంధించిన రహస్యాలను చెర్రీ సమక్షంలోనే బైట పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్.

