రానా విషయంలో అలాంటిదేం జరగలేదంటున్నాడు

తేజ డైరెక్షన్ లో రానా హీరోగా నటిస్తున్నాడు అంటేనే పెద్ద షాకింగ్ న్యూస్ అది. 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమా సైలెంట్ గా మొదలైపోయి అంతే స్పీడుగా ప్రేక్షకుల ముందుకు ఆగష్టు 11 న వచ్చెయ్యడానికి రెడీ అయ్యింది. అసలు తేజా తో సినిమా అంటే హీరోలు భయపడేంతగా తేజ ప్లాపుల రికార్డు ఉంది. అటువంటి సమయంలోనే రానా, తేజ తో పనిచేస్తున్నాడు అనగానే ఈ సినిమాపై జనాల్లో కొద్దిగా ఆసక్తి పెరిగింది. ఇక 'నేనే రాజు - నేనే మంత్రి' ట్రైలర్ తో ఆ ఆసక్తి అంచనాలు 1000 రేట్లు పెరిగిపోయాయి.
అయితే డైరెక్టర్ తేజ తాను డైరెక్ట్ చేసిన సినిమాలో తనకి కావాల్సిన అవుట్ ఫుట్ తెచ్చుకోవడానికి హీరోల మీద చెయ్యి చేసుకుంటాడనే న్యూస్ ఎప్పటినుండో ఇండస్ట్రీలో వుంది. ఈ విషయంలో తేజపై కొంతమంది యువ హీరోలనుండి వ్యతిరేఖత కూడా ఉంది. మరి ఇలా హీరోలపై చెయ్యి చేసుకునే డైరెక్టర్ తో రానా పనిచేస్తున్నాడనగానే అందరికి పాతరోజులు గుర్తుకువచ్చేసాయి. అంటే రానా సరిగ్గా చెయ్యకపోతే తేజ కొట్టేస్తాడా అనే డౌట్ ప్రతి ఒక్కరిలో వచ్చేసింది. కానీ తేజ సురేష్ బాబు కొడుకుని కొట్టేంత సీన్ లేదు .అందులోను బాహుబలిలో భళ్లాలదేవగా ఇరగదీసిన రానాని కి 'నేనే రాజు నేనే మంత్రి' వంటి చిత్రంలో కావలసినట్టు నటించడం పెద్ద విషయమూ కాదు. అయితే తేజ చేయిచేసుకున్న నటులు అప్పుడప్పుడే ఇండస్ట్రీలోచ్చినవారు. కానీ రానా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటనలో చాలా మెళుకువలు నేర్చుకున్నాడు.
అదే విషయం డైరెక్టర్ తేజ దగ్గర ప్రస్తావించగా... రానా విషయంలో అలాంటి విషయాలేమి జరగలేదని... అలాగే రానా చాలా ఇంటలిజెంట్ ఆర్టిస్టు అని కితాబునిచ్చేసాడు. అసలు రానా చాలా తెలివైన నటుడు మాత్రమే కాదు...... ఏదైనా ఒక సీన్ గురించి చెప్తే రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ పొద్దున్నే ఆ సన్నివేశానికి ఎలా బిహేవ్ చేయాలో సరిగ్గా అలాగే నటించేస్తాడు. మరి రానా లాంటి నటులు చాలా అరుదని చెబుతూనే..... సెట్ లో రానాలా కాకుండా జోగేంద్రలా బిహేవ్ చేసేవాడు. రానాలో ఆ ఇంటెలిజెంట్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది అంటూ తేజ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

