రాజశేఖర్ కి గతంలో మెగా మూవీలో ఆఫర్ మిస్ అయ్యిందా?

చాల కాలంగా విజయాలకు మొహం వాచిపోయి... ఇపుడు తాజాగా పి ఎస్ వి గరుడవేగా సినిమా తో మళ్ళి హీరో గా ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ ని అందుకున్నాడు సీనియర్ హీరో రాజశేఖర్. ఈ సినిమా హిట్ తో రాజశేఖర్ మల్లి కోలుకున్నాడు. అటు ఆరోగ్యపరంగా ఇటు అవకాశాల పరంగా రాజశేఖర్ మళ్ళీ లైం లైట్ లోకొచ్చినట్టే. ఇప్పుడు ఎక్కడ చుసిన రాజశేఖర్ గరుడవేగా టాపికే. ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో రాజశేఖర్ కుటుంబం మొత్తం పాల్గొంటూ సినిమాపై ఇంకాస్త ఆసక్తిని పెరిగేలా చేస్తున్నారు.
ఇక గరుడవేగా సక్సెస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆయన గురించిన చాలా విషయాలే బయటికి వస్తున్నాయి. అందులో మచ్చుకు... రాజశేఖర్... అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కిన సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడట. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సన్నాఫ్ అఫ్ సత్యమూర్తి లో ఉపేంద్ర క్యారెక్టర్ కి ముందుగా రాజశేఖర్ ని అనుకున్నారట. స్వయంగా త్రివిక్రమ్... హీరో రాజశేఖర్ ని కలిసి ఈ పాత్ర చేయాలి అని కోరాడట. కాని ఆ సినిమా మెగా హీరో అల్లు అర్జున్ కి చెందిన సినిమా కావడం తో కొంత మంది పనిగట్టుకొని మరి రాజశేఖర్ ని ఆ సినిమాని మిస్ చేసుకునేలా చేసారట.
నిజంగా ఆ సినిమాలో లో గాని ఉపేంద్ర పాత్ర లో రాజశేఖర్ గాని నటించి ఉంటే ఈపాటికి రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పది హిట్ మూవీస్ లో నటించి ఉండేవాడంటున్నారు. మరి రాజశేఖరేమో మెగా ఫ్యామిలీతో.. చిరు తో విభేదాలు లేవు... ఆయన మా గరుడవేగా కి చాలా హెల్ప్ చేసాడని ఓపెన్ గా చెప్పడమే కాదు.. మా మధ్యన గొడవలు పెట్టొద్దని వేడుకుంటున్నాడు

