రాజమౌళి సస్పెన్స్ కి తెర దించాడు!

బాహుబలితో ప్రపంచం చూపంతా తనవైపు తిప్పుకున్న రాజమౌళి.... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎపుడు మొదలుపెడతాడా అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. బాహుబలితో కలెక్షన్స్ సునామి సృష్టించి.... రికార్డులు తిరగరాసిన రాజమౌళి తర్వాతి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది... ఏ స్టార్ తో ఉండబోతుంది.. అనే సస్పెన్స్ కి మాత్రం ఇంకా తెర దించకుండా రాజమౌళి అందరిని అయోమయంలోనే వుంచుతున్నాడు. రాజమౌళిని ఎన్నిసార్లు అడిగిన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమైఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా అందరిని ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాడు.
మరి అంతటి సస్పెన్స్ కి తెర దించుతూ ఇప్పుడు రాజమౌళి అర్ధమయ్యి అర్ధమవనట్టు తన నెక్స్ట్ రెండు సినిమాల గురించి కొద్దిగా క్లారిటీ ఇచ్చాడు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించే కాకుండా ఆ నెక్ట్ ప్రాజెక్ట్ గురించిన వివరాలు చెప్పేసాడు. ముందుగా నిర్మాత డివివి. దానయ్య నిర్మాణ సారధ్యంలో ఒక మంచి సోషల్ డ్రామా ఉన్న కథను తెరకెకెక్కించడానికి రెడీ అవుతున్నానని.... కానీ ఆ సినిమాలో నటీనటులు ఎవరనేది ఇప్పుడే చెప్పలేనని చెబుతూనే.... ఒక స్టార్ హీరోతోనే ఆ సినిమా ఉంటుందని మాత్రం చెబుతున్నాడు. అంతేకాకుండా ఆ చిత్రం తర్వాత మరో ప్రాజెక్ట్ విషయానికి వస్తే.... ఎప్పటి నుండో మహేష్ - రాజమౌళి కలయికలో సినిమాను తెరకెక్కించాలని నిర్మాత కె.ఎల్ నారాయణ కాచుకుని కూర్చున్నాడు.
అయితే ఇప్పుడు ఫైనల్ గా కె.ఎల్ నారాయణ నిర్మాణ సారధ్యంలో మహేష్ హీరోగా.. రాజమౌళి దర్శకుడిగా 2019లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని రాజమౌళి చెబుతున్నాడు. మరి దీన్నిబట్టి రాజమౌళి ఇప్పట్లో ఆయన కలల ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించే ఛాన్స్ లేదన్నమాట.

