రాజమండ్రిలో సమంత యూ టర్న్

పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలు తగ్గించేస్తారు. కానీ సమంత ఆలా కాదు పెళ్లికి ముందు కన్నా పెళ్లి తర్వాత డిఫరెంట్ సినిమాలు చేస్తుంది. ఎప్పటి నుండో కన్నడ సినిమాను రీమేక్ చేయాలనీ చూస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కింది.
కన్నడలో సూపర్ హిట్ అయ్యిన 'యు టర్న్' అనే మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్ చూసి ఫిదా అయిపోయింది సామ్. ఈ సినిమాను తెలుగు రీమేక్ చేస్తే బాగుంటదని భావించి స్క్రిప్ట్ ను ఇక్కడ టెక్నీషియన్స్ తో తెలుగుకు తగ్గట్టుగా రెడీ చేసి సరికొత్తగా తెరకెక్కించడానికి ప్లాన్ చేసింది. ఫస్ట్ షెడ్యూల్ ని రాజమండ్రిలోని ఒక బిల్డింగ్ లో స్టార్ట్ చేశారు. అక్కడ కొన్ని రోజులు షూట్ చేయగానే అక్కడ సమంత వచ్చిందని తెలుసుకున్న చాలా మంది అక్కడికి వచ్చారు.
వారిని చూసి సమంత ఎంతో ఆనందపడింది. అందరిని చూసి చేయి ఊపింది. అందుకు సంబందించిన ఓ వీడియోను సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ రీమేక్ ను ఒరిజినల్ మూవీను తీసిన పవన్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు.

