రయీజ్ పైనే బాలీవుడ్ బాద్షా ఆశలు అన్నీ

బాలీవుడ్ హీరోల గత రెండు దశాబ్దాలుగా అగ్ర తారగా వెలుగొంది విదేశాలలోనూ తన మార్కెట్ సుస్థిరం చేసుకున్న నటుడు షారుఖ్ ఖాన్. ఇటీవలి కాలంలో షారుఖ్ ఖాన్ కి విదేశాలలోని కాక స్వదేశంలోనూ వరుస వైఫల్యాలతో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్, దిల్వాలే, ఫ్యాన్ చిత్రాలతో హ్యాట్ ట్రిక్ ఫెయిల్యూర్స్ ఖాతాలో వేసుకుని వైవిధ్యమైన పాత్ర అని నమ్మి చేసిన డియర్ జిందగీ చిత్రం ఇటీవల విడుదల చేసాడు షారుక్. కాగా ఈ చిత్రం కూడా వసూళ్ల విషయంలో షారుఖ్ ఖాన్ కి పూర్వ వైభవం తీసుకు రాలేకపోతుంది.
డియర్ జిందగీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో షారుక్ ఆశలన్నీ తదుపరి విడుదల రయీజ్ పైనే పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్థానీ నటులపై విధించిన నిషేధానికి ఈ చిత్రం సుఫర్ ఐయింది. తిరిగి చిత్రీకరణ శరవేగంగా పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నెల 7 వ తేదీన ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేయనున్నారు. జనవరి 26 కు రయీజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
రాహుల్ దొలాకియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రయీజ్ చిత్రాన్ని షారుక్ ఖాన్, ఫరాహ్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ ల వసూళ్ల జోరుకు సమాధానం చెప్పేలా షారుక్ రయీజ్ ఉండబోతోందో లేదో వేచి చూడాలి. బాలీవుడ్ చిత్రాలలో తొలి రెండు స్థానాలు పీకే, సుల్తాన్ ఆక్రమించగా, ఈ నెల 23 న విడుదల కానున్న దంగల్ చిత్రం పీకే చరిత్ర తిరగ రాస్తుంది అని బాలీవుడ్ ట్రేడ్ అంచనా. మరి దంగల్ విడుదల తరువాత నెల రోజులకి విడుదల కానున్న రయీజ్ కు టార్గెట్ భారీగానే ఉండబోతుంది.

