రమ్యకృష్ణ సునీతగానా..?

బాహుబలి సినిమాతో ఫుల్ ఫామ్ లోకొచ్చేసిన రమ్యకృష్ణ చేతినిండా అవకాశాలతో బిజీ తారగా మారిపోయింది. అసలు రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించడం దగ్గరనుండి నటనకు ఫుల్ స్టాప్ పెట్టకుండా నటిస్తూనే వుంది. కానీ బాహుబలి సినిమాతో శివగామిగా అదరగొట్టే పెరఫార్మెన్సు తో అందరి మనస్సులో నిలిచిపోయింది. అప్పటినుండి రమ్యకృష్ణ ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి మంచి క్రేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు రమ్యకృష్ణ... పవన్ మల్లెల దర్శకత్వంలో నారా రోహిత్ - రెజినా జంటగా తెరకెక్కుతున్న బాలకృష్ణుడు సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో అల్లుకున్న కథ తో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రంలో రమ్యకృష్ణ పరిటాల సునీత పాత్రలో కనబడనుందని అంటున్నారు. ఈ సినిమా మొత్తం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న కథగా ఉంటుందని... ఆ కథ కూడా పరిటాల రవీంద్ర కథలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో పరిటాల రవిని కిడ్నాప్ చేస్తే... ఆయన భార్యగా పరిటాల సునీత ఎలా పోరాడారన్నది.. కథగా తెలుస్తుంది. అసలు పరిటాల రవీంద్ర లాంటి బలమైన పాత్రగల క్యారెక్టర్ ను ఎందుకు కిడ్నాప్ చేసారన్నది మరో ట్విస్ట్ గా చెబుతున్నారు.
అయితే ఆ పరిటాల రవీంద్ర పాత్రని కిడ్నాప్ చేసే కేరెక్టర్ లో నారా రోహిత్ కనబడతాడని అంటున్నారు. అంటే నారా రోహిత్ దాదాపు ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనబడతాడా? అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు పరిటాల జీవిత కథ గుర్తుకు వస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది. మరి శివగామిగా బాహుబలిలో అదరగొట్టిన రమ్యకృష్ణ ఈ సినిమాలోనూ పరిటాల సునీత కేరెక్టర్ లో ఇరగదీస్తుందేమో చూద్దాం.

