రకుల్ కోరిక తీరబోతుందా..?

పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందని ఎప్పుడో తన మనసులోని కోరికను బయటపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్ హీరోలందరితో దాదాపుగా జోడి కట్టిన ఈ భామకు జీవిత కాలం గుర్తుడిపోయే హిట్ ఇంతవరకు పడలేదు. కానీ తన గ్లామర్ తో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తూ టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కి వెళ్ళిపోయింది. స్టార్ హీరోలతో నటిస్తూనే ఈ భామ ఇటు కుర్ర హీరోల సరసన కూడా నటిస్తుంది. అయితే ఇప్పటివరకు పవన్ పక్కన ఛాన్స్ దొరకని ఈ భామకి ఇప్పుడు ఛాన్స్ వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న పవన్ ఈ చిత్రం కంప్లీట్ కాగానే నేసన్ డైరెక్షన్ లో ఒకమూవీకి కమిట్ అయ్యాడు. అయితే నేసన్ చిత్రం ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇక నేసన్ తో కాకుండా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ సినిమా ఉన్నట్లు ఆ మధ్యన ప్రచారం జరిగింది. అయితే అది ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుని పట్టాలెక్కించే దిశగా ఏర్పాట్లు జరుగుతూన్నాయనే టాక్ వినబడుతుంది.
స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంలో సంతోష్... పవన్ పక్కన నటించే హీరోయిన్ వేటలో ఉన్నాడట. అయితే పవన్ పక్కన ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ అయితే బావుంటుందని భావిస్తున్నారట. చిత్ర యూనిట్ రకుల్ ని అప్రోచ్ అయ్యే పనిలో ఉందంటున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

