రకుల్ కు కోపం వచ్చింది

మన దేశంలో జరిగే అత్యాచారాలు పై స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కోపం వచ్చింది. ఎప్పుడు నవ్వుతూ.. వుండే ఈ అమ్మడుకి ఎప్పుడు లేనంత కోపం వచ్చింది. మన దేశంలో అత్యాచారాలు ఆగట్లేదని.. రోజు రోజుకూ పెరుగుతున్నాయని వీటిని అడ్డుకోవాలంటే అత్యాచారాలకు పాల్పడేవాళ్లను జనాల మధ్యకు తీసుకొచ్చి శిక్షించాలని ఆమె అభిప్రాయపడింది.
అత్యాచారాలకు పాల్పడేవాళ్లని కోర్టు చుట్టు తిప్పితే ఏదొక రోజు బయటి వచ్చేయొచ్చు. అలాంటి వాళ్ళని అరబ్ దేశాల్లో మాదిరి జనాల్లోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని.. అక్కడి మాదిరే చేతులు తెగ నరకాలని రకుల్ అంది. ఇలాంటి ఆలోచనలు పోవాలంటే మన దేశంలో కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలని ఆమె అభిప్రాయపడింది.
సినీ పరిశ్రమలో జరిగే లైంగిక వేధింపుల గురించి నేను మాట్లాడాను ఎందుకంటే అలాంటివి సమస్యను నేను ఎదుర్కోలేదని రకుల్ తెలిపింది. మీడియా సినీ పరిశ్రమపై ఫోకస్ చేయకుండా..కొన్ని ఆఫీసుల్లో మహిళలు అవస్థలు పడుతున్నారని.. దాని గురించి పట్టించుకునేదెవరని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.

