Sun Mar 22 2026 14:44:51 GMT+0530 (India Standard Time)
రంగమ్మత్త ఘాటుగా స్పందించింది

రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో అందరిని ఆకట్టుకున్న అనసూయ ఒక పక్క బుల్లితెర యాంకర్‌గా.. చిన్న చిన్న పాత్రలు చేస్తూ బిజీగా అయిపోయింది. అయితే ఆమెపై సోషల్ మీడియాలో చాలానే విమర్శలు వస్తున్నాయి.
ఓవైపు యాంకర్లా టీవీల్లో కనిపించడం మరోవైపు ఐటమ్ సాంగ్స్ చెయ్యడం ఇద్దరు బిడ్డల తల్లివి అయినా నీకు అవసరమా? అంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శల పట్ల అనసూయ ఘాటుగా స్పందించింది.
ఇద్దరు బిడ్డలు తల్లినైతే ఏంటి? బాలీవుడ్లో చాలామంది హీరోయిన్ లకు పెళ్లిళ్లవడమే కాకుండా, పిల్లలు కూడా వున్నారు. ఒక్కపాటి స్టార్స్ సావిత్రిగారు..భానుమతిగారు పెళ్ళైన తర్వాత కూడా కెరీర్లో అద్భుతంగా రాణించారు. అప్పుడు లేని విమర్శలు ఇప్పుడెందుకు అని ఘాటుగా స్పందించింది అనసూయ.
- Tags
- అనసూయ
Next Story

