Mon Dec 22 2025 04:38:20 GMT+0000 (Coordinated Universal Time)
`యూత్ ఐకన్` రామ్‌చరణ్

రామ్‌చరణ్‌కి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. హీరోగా మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీతో స్పందించే వ్యక్తిగా బహుముఖ పాత్రల్లో జీవిస్తున్న మెగా తనయుడు చెర్రీ.. యూత్ ఐకన్ పురస్కారం అందుకున్నారు.
సినిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువతరానికి మలయాళ పరిశ్రమ 'ఆసియా విజన్ -2016' పేరిట 'యూత్ ఐకన్' పురస్కారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కమిటీ టాలీవుడ్ నుంచి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌ని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసుకోవడం విశేషం.
తనదైన ఛరిష్మాతో వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్న స్టార్ హీరో చరణ్‌కి కోట్లాది ప్రేక్షకాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయాలు ఈ యువహీరో సొంతం. తన రెండో సినిమా(మగధీర)కే బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు పైగా వసూళ్లు సునాయాసంగా రాబట్టిన హీరో చరణ్. అందుకే అతడి ప్రతిభకు చక్కని గుర్తింపు దక్కింది. ఇటీవల షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన 'ఆసియా విజన్ -2016' వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్నత 'యూత్ ఐకన్' పురస్కారం అందించారు. దుబాయ్‌లో ప్రతియేటా నిర్వహించే అతి పెద్ద మలయాళ అవార్డుల కార్యక్రమం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. లేటెస్టుగా చరణ్ నటించిన 'ధృవ' అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తను నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఖైదీ నంబర్ 150' సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Next Story

