Fri Dec 26 2025 17:15:25 GMT+0000 (Coordinated Universal Time)
యాంగ్రీ రైటర్ని పవన్ డైరక్టర్గా మారుస్తాడా?

కోన వెంకట్ దర్శకుడిగా మారాలని ఎప్పటినుండో కలలు కంటున్నాడు. కానీ అతని ఆ అవకాశం మాత్రం రావడం లేదు. కానీ కోన ఒక పక్క స్టోరీ రైటింగ్ లో బిజీ గా ఉంటూనే మరో పక్క ప్రొడ్యూసర్ గా కూడా అవతారమెత్తాడు. అయినా కూడా అతనికి మాత్రం డైరెక్షన్ మీదే చూపంతా. అయితే ఈ మధ్యన తనకి డైరెక్షన్ అవకాశం రాకపోవడానికి కారణం... త్రివిక్రమ్, కొరటాల శివ అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. వారు రైటర్స్ గా ఉంటూనే దర్శకత్వ బాధ్యతలు మోస్తూ వేరే డైరెక్టర్ కి కథలు ఇవ్వడం మానివేయడం వల్ల రైటర్స్ కొరత ఏర్పడి నేను రైటర్ గా బిజీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. అందుకే చాలామంది డైరెక్టర్స్ తమకి కథ కావాలని పట్టుబట్టి తనని కమిట్ చేయిస్తున్నారని వాపోతున్నాడు.
అయితే ఇప్పుడు కోన పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్నట్లు రూమర్స్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. దాసరి ప్రొడ్యూసర్ గా పవన్ నటించే సినిమాకి కోన వెంకట్ దర్శకత్వం వహిస్తున్నాడని అంటున్నారు. ఈ వార్తలకి స్పందించిన కోన 'నాకు డైరెక్టన్ చెయ్యాలని ఎప్పటినుండో వుంది కానీ... కొన్ని కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యం కాలేదు. కానీ పవన్ మాత్రం ఒక మంచి కథ తో వస్తే గనక నీకు డైరెక్టర్ ఛాన్స్ ఇస్తానని నాకు మాట ఇచ్చాడు. పవన్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే పవన్ నాకు మాటిచ్చాడు' అని చెబుతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగేఅసలు దాసరి ప్రొడక్షన్ లో ఈ సినిమా ఉంటుందో లేదో అనేది కూడా చెప్పలేదు.
Next Story

