యంగ్ హీరోకి కౌంటర్లు బాగానే పడుతున్నాయ్

ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరో సినిమా విడుదలకు రెడీగా వుంది. మరి సినిమా పూర్తయ్యి చాలా కాలమే అయ్యింది. కానీ కొన్ని ప్రొబ్లెమ్స్ వల్ల ఆ సినిమా ఇంతవరకు విడుదల కాకూండా ఆగిపోయింది. కానీ యంగ్ హీరో చొరవతో ఆ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే ఆ సినిమాకి క్రేజ్ తీసుకురావడానికి ఆ యంగ్ హీరో చెయ్యని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే ఈసినిమాకి నెగెటివ్ పబ్లిసిటీతో జనాల్లోకి బాగానే ప్రమోట్ చేయగలిగాడు. కానీ ఆ హీరో మాట్లాడిన కొన్ని మాటలు, అలాగే ఆ సినిమాలో ఉన్న కొన్ని లిప్ లాక్ కేస్ సీన్స్ పెద్ద సంచలనం అవుతున్నాయి.
అందులో భాగంగానే ఇప్పుడికో తెలుగు డైరెక్టర్ ఆ హీరోకి వేసి వెయ్యకుండా కొన్ని కౌంటర్లు వేసాడు. 'ఆడుతూ పాడుతూ, లీలామహల్ సెంటర్, దట్ ఈజ్ పండు, బ్లేడ్ బాబ్జీ, మిస్టర్ పెళ్లికొడుకు, కెవ్వుకేక' సినిమాల డైరెక్టర్ దేవీ ప్రసాద్ ఆ యంగ్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ ఈవెంట్లు లాంటి సినిమా ఫంక్షన్స్‌లో కొందరు సినిమా వాళ్లు వాడుతున్న భాష అసభ్యకరంగా ఉందని దేవీ ప్రసాద్ అభిప్రాయపడిన దేవి ప్రసాద్... ఎవడి బాత్రూంలో వాడు ఎలాగైనా స్నానం చేయొచ్చు. కానీ పబ్లిక్‌గా చెరువులో స్నానం చేసేప్పుడు గోచీ అయినా లేకపోతే బాగుండదు కదా. ఈ మధ్య ఫేస్బుక్ లోనేకాదు.. సినిమా ఫంక్షన్స్‌లోనూ కొందరు వాడుతున్న భాషకు గోచీ కూడా ఉండటం లేదు.... అంటూ సంచలనంగా మాట్లాడాడు.
మరి దేవీప్రసాద్ మాట్లాడిన మాటలు కేవలం ఆ యంగ్ హీరోని ఉద్దేశించి మాట్లాడింది అంటూ ఇప్పుడు కొంతమంది ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పటికే ఈ యంగ్ హీరోమీద ఒక సీనియర్ నేత ఫైర్ అవుతున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ మేటర్ అంతా చూసిన మీకు ఈ మేటర్ లో ఉన్న యంగ్ హీరో ఎవరో మీకు ఈపాటికే అర్ధమై ఉండాలి...!

