మ్యారేజ్ తర్వాత నోరు విప్పిన బొద్దు గుమ్మ!

ప్రస్తుత వున్న పరిస్థితిల్లో పెళ్లి తర్వాత హీరోయిన్స్ లైఫ్ చాలా మారిపోతుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో చాలా తక్కువగా నటిస్తుంటారు హీరోయిన్స్. ఇలా చాలా మార్పులు వస్తాయి పెళ్లి తర్వాత. టాలీవుడ్ - కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి నమిత లేటెస్ట్ గా చాలా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. గ్లామర్ గర్ల్ గానే కాకుండా కొన్ని ప్రయోగాత్మకమైన పాత్రలను చేసి మెప్పించింది ఈ అమ్మడు. స్టార్ ఇమేజ్ తెచ్చుకోవటంతో కోలీవుడ్ లో వరస అవకాశాలు వచ్చాయి.
పెళ్లి తర్వాత నా లైఫ్ ఏమి మారలేదు కేవలం ఒక తాళి - మెట్టెలు వచ్చాయి అంతే అని లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన మ్యారేజ్ లైఫ్ గురించి వివరించింది నటి నమిత. నమిత మాట్లాడుతూ.. వీర్ తో నా లైఫ్ ప్రస్తుతం చాలా బావుంది. నేను మూడు సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను. సో..ఒక మంచి వ్యక్తిని భర్తగా ఎంచుకోవడం నాకు చాలా ఈజీ. వీర్ ప్రపోజ్ చేసినప్పుడు నో అనడానికి చిన్న కారణం కూడా కనిపించలేదు. ఒకవేళ తాను ప్రపోజ్ చేయకపోయినా నేను ప్రపోజ్ చేసేదానిని అని చెప్పింది.
మ్యారేజ్ తర్వాత నా లైఫ్ ఏమి మారలేదని.... ఇంకా అలానే వున్నానని చాలా సంతోషంగా కూడా వున్నానని చెప్పింది. మెట్టెలు - తాళి తప్ప నా లైఫ్ లో ఏమి తేడా లేదు. అలాగే సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకో, చీర కట్టుకో అని మా అత్త మామలు ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని శ్రీమతి నమిత వీర్ వివరించింది.

